టాలీవుడ్ నటుడు హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నాడు రెబల్ స్టార్ కృష్ణంరాజు.
ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి అయినా భార్య శ్యామల దేవి గురించి కూడా మనందరికీ తెలిసిందే.ఈమె అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు విషయాలపై స్పందిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా శ్యామలాదేవి ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.అంతేకాకుండా చిరంజీవి ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో శ్యామలాదేవి మాట్లాడుతూ.కృష్ణం రాజు కి పెసరట్టు వెయ్యడం అంటే చాలా ఇష్టమని, కరోనా లాక్ డౌన్ సమయంలో కృష్ణం రాజు ఇంట్లో అందరికీ పెసరట్లు వేసి ఇచ్చేవారు అని తెలిపింది.
అనంతరం చిరంజీవి గురించి మాట్లాడుతూ చిరంజీవికి శ్యామల దేవి ఇంటిలో చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టమని, ఒకసారి స్వయంగా బిర్యాని చేసి పంపించండి అన్నయ్య అని ఇష్టం రాజుని అడిగారట చిరంజీవి.అయితే ఎవరికైనా ఏదైనా చేసి ఇవ్వాలి ఎలా పెట్టాలి ఎలా నేను ముందుంటాను, పనివాళ్లకు అప్పజెప్పను, బిర్యాని కూడా నేనే చేస్తాను అని చెప్పుకొచ్చింది శ్యామల దేవి.
అలా చిరంజీవి కోరిక మేరకు బిర్యాని చేసి పంపించగా బాగా ఉంది అన్న దాంతోపాటు సాయంత్రానికి కూడా దాచుకొని తిన్నారు అని చెప్పుకొచ్చింది శ్యామల దేవి.

అంతేకాకుండా చిరంజీవి కృష్ణంరాజు ఎన్ని గంటలకు టిఫిన్ తింటారు అడిగిమరీ మరుసటి రోజు ఉదయం రెండు మూడు రకాల చట్నీలతో దోశలు పంపించారట.చిరంజీవి భార్య సురేఖ దోశలు బాగా వేసేవారు అని కృష్ణంరాజు పలుసార్లు చెప్పుకొచ్చాడు అని శ్యామల దేవి తెలిపింది ఇక ఇటీవలే లాక్‌డౌన్ సమయంలో అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడు చిరంజీవి కోడలు అయిన ఉపాసన దగ్గరుండి మరీ తన సొంత బిడ్డలా గా మమ్మల్ని చూసుకుంది అని తెలిపింది శ్యామల దేవి.రామ్ చరణ్ ఎంత మంచి అబ్బాయో, ఉపాసన కూడా అంతే మంచి అమ్మాయి.
అందుకే వారిద్దరూ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది శ్యామలాదేవి.హీరో ప్రభాస్ కూడా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, చిరంజీవి గారు కూడా ప్రతి ఒక్కరికి మర్యాద ఇస్తారు.
ప్రభాస్ కూడా అంతే అందరిని సమానంగా గౌరవిస్తూ పలకరిస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చింది శ్యామలాదేవి.







