ఏ దేశంలో ఉన్నా సరే ఆదేశానికి చెందిన రూల్స్ కి విరుద్దంగా ఎవరు నడుచుకున్నా సరే వారిపై ఆయా దేశాలు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాయి, చేసిన తప్పులను బట్టి భారీగా నష్ట పరిహారం జైలు జీవితం కూడా ఒక్కో సారి చవిచూడాల్సి వస్తుంది.అలాంటి అనుభవమే ఇద్దరు భారతీయ విద్యార్ధులకు ఎదురయ్యింది.సింగపూర్ లో రూల్స్ కి వ్యతిరేకంగా నడుచుకున్నందుకు గాను ఇద్దరు విద్యార్ధులకు కలిపి రూ.3 లక్షల ఫైన్ విధించింది.వివరాలలోకి వెళ్తే.
కరోనా కారణంగా భారీ నష్టాన్ని చవి చూసిన దేశాలలో సింగపూర్ కూడా ఉంది.అక్కడ ప్రాణ, ఆస్థి నష్టాలను చవి చూసింది.మాస్క్ తప్పనిసరి చేస్తూ పలు కటినమైన రూల్స్ ను విధించింది.
ఈ రూల్స్ ని అతిక్రమించిన వారిపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా.ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నిభంధనలను సడలిస్తున్నా సరే సింగపూర్ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
ఈ క్రమంలోనే ఇద్దరు భారతీయ విద్యార్ధులు హర్జాజ్ సింగ్, పుల్కిత్ లు కోవిడ్ నిభందనలకు విరుద్దంగా నడుచుకున్నారు.
న్యూ ఇయర్ సమయంలో మాస్క్ లేకుండా వేడుకల్లో పాల్గొనడమే కాకుండా ఎంతో మందితో కలిసి పార్టీ చేసుకున్నారు.అలాగే తమ పుట్టిన రోజు వేడుకల్లో కూడా మాస్క్ లేకుండానే పాల్గొన్నారని వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్న వీడియోలలో స్పష్టంగా కనపడటంతో పలువురు వారిపై ఆన్లైన్ లో ఫిర్యాదులు చేశారు.ఈ విషయం సింగపూర్ పోలీసుల వరకూ వెళ్ళడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.విచారణ చేపట్టిన కోర్టు ఇరువురుకి కలిపి రూ.3 లక్షల ఫైన్ విధించింది.వాస్తవంగా సింగపూర్ రూల్స్ ప్రకారం కోవిడ్ నిభంధనలకు విరుద్దంగా నడుచుకున్న వారికి భారీ ఫైన్ లతో పాటు ఆరు నెలలు జైలు జీవితం కూడా విధిస్తోంది కోర్టు.