ఛత్తీస్‌గఢ్‌లో ఆవు పేడతో పలు ఉత్పత్తులను తయారు చేసి వేలాది మంది గ్రామీణ మహిళలు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు.ఒక నివేదిక ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా గ్రామీణ ప్రాంతాల మహిళలకు సాధికారత కల్పించేందుకు రాష్ట్ర గోధన్ న్యాయ్ పథకం కింద ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వారు తమ ఉత్పత్తులు విస్తృత మార్కెట్‌కు ప్రయత్నాలు చేస్తున్నారు.రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని మహిళలు స్వయం సహాయక సంఘాలతో అనుబంధం కలిగి ఉన్నారు.
పేడ, పిడకలు (ఇంధనంగా ఉపయోగిస్తారు), దియాలు (దీపాలు), కుండీల వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.దీని గురించి జిల్లా మేజిస్ట్రేట్ రాజ్‌నంద్‌గావ్ మాట్లాడుతూ గోధన్ న్యాయ్ యోజన అనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన పథకం.
జిల్లాలో 358 గ్రూపులు ఏర్పడ్డాయి.
అమెజాన్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆవు పేడతో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
ఈ విషయంలో రాష్ట్రంలో రాజ్‌నంద్‌గావ్ మొదటి జిల్లాగా అవతరించిందని సిన్హా చెప్పారు.మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఇతర రాష్ట్రాలలో కూడా ఆవు పేడ ఉత్పత్తులపై అక్కడి మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు.
స్వయం సహాయక సంఘం సభ్యుడు ముస్కాన్ వర్మ మాట్లాడుతూ.ఇప్పటి వరకు రూ.5 కోట్ల విలువైన ఆవు పేడ ఉత్పత్తులు అమ్ముడయ్యాయి.ఇటీవలే ప్రారంభమైన ఆన్‌లైన్ సేల్‌లో ఇప్పటి వరకు రూ.లక్ష విలువైన ఉత్పత్తులు అమ్ముడయ్యాయని తెలిపారు.పాడి రైతుల నుండి ఆవు పేడను కిలోకు 2 రూపాయలకు కొనుగోలు చేయడానికి రాష్ట్రంలో గోధన్ న్యాయ్ యోజనను ప్రారంభించారు.







