తమ సంస్ధ ద్వారా ఉక్రెయిన్ దేశం లో విద్యను అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులంతా క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారని నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ దివ్య సునీత తెలిపారు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సమస్త చైర్మన్ ఆవులప్ప, సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ లతో కలిసి మాట్లాడారు.
తమ సంస్థ నుంచి సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్ దేశం వెళ్లారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వారంతా క్షేమంగా తిరిగి స్వదేశానికి చేరుకున్నారు అని చెప్పారు.అనూహ్యంగా వచ్చిపడ్డ ప్రతిష్టంభన తో విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ క్లాసులు, ప్రాక్టికల్స్ ను సైతం నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇంకా ఉక్రెయిన్ లో ఉండిపోయిన నా విద్యార్థులందరినీ కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో క్షేమంగా చేరుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.







