తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రణరంగంగా మారుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, రాజా సింగ్ లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే తమ మీద విధించిన సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలంటూ గవర్నర్ తమిళి సై ని బీజేపీ ఎమ్మెల్యేలు కోరిన విషయం తెలిసిందే.అయితే ఇక బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశంలో వెల్ లోకి వెళ్ళడం ద్వారా సస్పెండ్ అవుతామని ముందే తెలిసి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను చూసి కెసీఆర్ భయపడుతున్నారనే సంకేతాన్ని ప్రజలలోకి పంపడంతో పాటు కొద్ది మంది బీజేపీ ఎమ్మెల్యేలే ఇంత సంచలనం సృష్టిస్తే ఇక ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుందనే విధంగా ప్రజలు ఆలోచన కలగాలనే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలు వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం బీజేపీ అసెంబ్లీ సమావేశాలలో కొంత హడావిడి సృష్టించాలని అనుకున్నా ఇక సస్పెన్షన్ తో మొత్తం ప్లాన్ అంతా ఫెయిల్ అయిన పరిస్థితి ఉంది.బండి సంజయ్ ఈ సస్పెన్షన్ వ్యవహారంపై ఘాటుగా స్పందించినా భవిష్యత్ కార్యాచరణను ఇంకా ప్రకటించలేదు.
ఇప్పటికే గవర్నర్ లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంతోనే గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ మరింత ముదరడంతో ఇక గవర్నర్ తమిళి సై కూడా పెద్ద స్థాయిల్లో ఉన్న మహిళలకు కూడా గౌరవం దక్కడం లేదని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ప్రస్తుతం బీజేపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా రాజకీయ లబ్ధి కొరకు వినియోగించుకునే అవకాశం ఉంది.
మరి రానున్న రోజుల్లో ఎలా వ్యవహరిస్తుందనేది చూడాల్సి ఉంది.