పెట్రోల్ బంకుల నుంచి ఇబ్బందులు ఎదురైతే ఎవరికి?.. ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసా?

ఫలానా పెట్రోల్ పంపులో తక్కువ పెట్రోల్ ఇస్తున్నారని, తాము మోసపోతున్నామని తరచుగా పలువురు ఆరోపిస్తుంటారు.బహుశా మీకు కూడా ఈ విధంగా ఏదైనా పెట్రోల్ పంపుపై అనుమానం వచ్చివుండవచ్చు.

 How To Complain Petrol Pump For Any Issue , Petrol, Petrol Issue , Company Sal-TeluguStop.com

మీకు ఇలాంటి ఘటన ఎదురైతే మీరు దానిపై ఫిర్యాదు చేయవచ్చు పెట్రోల్ పంపుపై చర్యలు చేపట్టాలని కోరవచ్చు.ఫిర్యాదులు నిజమని తేలితే పెట్రోల్ పంప్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది.

పెట్రోల్ బంకులలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఎలా ఫిర్యాదు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.పెట్రోల్ పంప్ సిబ్బంది మీకు తక్కువ పెట్రోల్ పోస్తున్నారని మీకు అనిపిస్తే మీరు ఫిర్యాదు చేయవచ్చు.ఉదాహరణకు మీరు రూ.100 విలువైన పెట్రోల్‌ను వాహనంలో నింపించారని అనుకుందాం.అయితే ఈ పెట్రోల్ తక్కువగా ఉందని మీరు భావిస్తే దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు.

అటువంటి పరిస్థితిలో మీరు పెట్రోల్ పంపు వద్ద ఉంచిన ధృవీకరించబడిన కొలతను ఉపయోగించవచ్చు.

అవును.ప్రతి పెట్రోల్ పంపు వద్ద ధృవీకరించబడిన కొలతలు ఉంటాయి.

దాని ద్వారా సరిగా పెట్రోల్ ఇవ్వబడుతున్నదో లేదో తనిఖీ చేయవచ్చు.మీరు ఏదైనా పెట్రోల్ పంపుపై ఫిర్యాదు చేయాలనుకుంటే.

మూడు మార్గాల్లో ఫిర్యాదు చేయవచ్చు.ముందుగా సంబంధిత పెట్రోలియం కంపెనీ సేల్స్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.

జిల్లా లాజిస్టిక్స్ అధికారి, జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.వినియోగదారుల ఫోరంలో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

మీరు పెట్రోల్ పంపుపై ఫిర్యాదు చేసినప్పుడు విచారణలో నిర్థారణ అయితే సంబంధిత పెట్రోలు బంకుకు జరిమానా విధిస్తారు.అలాగే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తే అప్పుడు పెట్రోల్ పంపు లైసెన్స్‌ను కూడా రద్దు చేసే అవకాశాలుంటాయి.ఇదేవిధంగా పెట్రోల్ కల్తీ అయ్యిందో లేదో కూడా తెలుసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube