ప్రియురాలితో వెంకటేష్ ముద్దుల కొడుకు నాగ్ అన్వేష్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఈ సినిమా ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందింది.

అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ ను సృష్టించింది.ఇప్పటికే ఈ సినిమా టీవీలో ప్రసారమవుతుంది అంటే చాలా మంది ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు.

ఈ సినిమాలో వెంకటేష్ కొడుకు గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నాగ అన్వేష్ గురించి మనందరికీ తెలిసిందే.చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఆకట్టుకున్నాడు నాగ అన్వేష్.

చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినది ఒక్క సినిమానే అయినప్పటికీ అందరికీ గుర్తుండిపోయారు.ఆ తరువాత వినవయ్య రామయ్య సినిమాతో హీరోగా కూడా పరిచయం అయ్యాడు.

Advertisement

ఈ సినిమా హిట్ అయినప్పటికీ నాగ అన్వేష్ కు సరైన గుర్తింపు దక్కలేదు.ఇదిలా ఉంటే హీరో నాగ అన్వేష్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు.

అతడు తన మనసుకు నచ్చిన అమ్మాయి తో తాజాగా హైదరాబాదులో అంగరంగ వైభవంగా నిశ్చితార్ధం చేసుకున్నాడు.ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు.

ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.నాగ అన్వేష్, కావ్య గత కొన్నాళ్లుగా ప్రేమించు కుంటున్నారు.వారిద్దరి ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకురాగా ఇరు కుటుంబాల సభ్యులు కూడా వారి ప్రేమను అంగీకరించారు.

కావ్య తండ్రి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ కంపెనీ డైరెక్టర్ విజయ్ కుమార్ కాగా, నాగ అన్వేష్ తండ్రి ప్రముఖ నిర్మాణ సంస్థ సింధూర పువ్వు కృష్ణారెడ్డి అన్న విషయం తెలిసిందే.నాగ అన్వేష్, కావ్య ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసిన సెలబ్రిటీలు నాగ అన్వేష్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు