ఇండియాకు వచ్చే వారికి గుడ్‌న్యూస్ : ఇకపై ‘నో క్వారంటైన్’.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.దాదాపు నెల రోజుల తర్వాత ఇవాళ రోజువారీ కేసుల సంఖ్య లక్ష దిగువకు పడిపోయాయి.

కాకపోతే మరణాలు మాత్రం నిత్యం వెయ్యికి తగ్గకుండా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 67,084 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.

అలాగే 1,241 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.చాలా రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తుండటంతో కేంద్రం కూడా ఆంక్షల విషయంలో దిగివస్తోంది.

ఈ నేపథ్యంలోనే భారత్‌కు వచ్చే విదేశీ ప్రయాణీకులు ఇకపై క్వారంటైన్‌లో వుండాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.ఈ మేరకు గురువారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

Advertisement

కొద్దినెలల క్రితం ఒమిక్రాన్ కారణంగా కొన్ని దేశాలను భారత ప్రభుత్వం ‘‘ఎట్ రిస్క్’’ కేటగిరీ కిందకు చేర్చింది.తాజాగా ఇప్పుడు దానిని ఎత్తివేసింది.

క్వారంటైన్‌ నిబంధనను తీసేసినప్పటికీ.విదేశీ ప్రయాణీకులు భారత్‌కు వచ్చిన నాటి నుంచి 14 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో వుండాలని మార్గదర్శకాల్లో తెలిపింది.

సడలించిన నిబంధనలు ఫిబ్రవరి 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి.ఇకపోతే, కేంద్రం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.

విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వారు స్వీయ ధ్రువీకరణను ఆన్‌లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది.ఎయిర్ సువిధ పోర్టల్‌లో వుండే ఈ ఫామ్‌ను నింపాల్సి వుంటుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలి.లేని పక్షంలో రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఇవ్వాలి.

Advertisement

ఈ నిబంధనలను పాటించిన వారినే ప్రయాణానికి అనుమతించాలని ఏవియేషన్ సంస్థలకు కేంద్రం ఆదేశించింది.కాగా.

ఇటీవల తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు.కరోనా ఉద్ధృతి పీక్ స్టేజీకి వెళ్లినప్పుడు రాష్ట్రంలో పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి చేరిందని డీహెచ్ వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి పడిపోయిందని.అందుచేత తెలంగాణలో థర్డ్ వేవ్ ముగిసినట్లేనని శ్రీనివాసరావు ప్రకటించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేవని, కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేసి పూర్తి సామర్థ్యంతో కార్యాలయాలు నిర్వహించుకోవచ్చని డీహెచ్ తెలిపారు.

తాజా వార్తలు