పేరెంట్స్ కి మూడోసారి పెళ్లి చేసిన సీరియల్ నటి.. కన్నీళ్లు పెట్టుకుంటూ?

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ ద్వారా ఎంతోమంది నటీనటులు తమ కంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు.వీరిలో ప్రియాంక జైన్ కూడా ఒకరు.

 Janaki Kalaganaledu Priyanka Jain In Star Maa Parivar League 3 Promo Details, J-TeluguStop.com

మౌనరాగం సీరియల్ లో అమ్ములు పాత్రలో నటించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలలో సీరియల్స్ చూసే వారిని మాత్రమే కాకుండా, యూత్ ని కూడా ఆకట్టుకుంది.తన నటనతో టీవీ సీరియల్స్ అంటే ఇష్టపడని కుర్రకారుని టీవీలకు అతుక్కుపోయే విధంగా చేసింది.

ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తోంది.మౌనరాగం సీరియల్ లో తన మూగ నటన తో ఎంతో మంది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

మరీ ముఖ్యంగా చెప్పాలంటే యూత్ ని బాగా ఆకట్టుకుంది.ఇక జానకి కలగనలేదు సీరియల్ ని కేవలం ప్రియాంక జైన్ కోసం చూసే వారు ఎంతో మంది వున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇది ఇలా ఉంటే ఈమె తన తల్లిదండ్రులకు పెళ్లి చేసి గొప్ప కూతురు అనిపించుకుంది.స్టార్ మా పరివార్ లీగ్ 3 ఫిబ్రవరి 6 నుంచి ప్రసారం కాబోతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమోని విడుదల చేశారు.

ఆదివారం మధ్యాహ్నం 1: 30 నిమిషాలకు స్టార్ మా పరివార్ లీగ్ 3 మొదలు కానుంది.ఈ కార్యక్రమానికి యాంకర్ గా సీనియర్ యాంకర్ ఝాన్సీ వ్యవహరిస్తోంది.తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా.

అందులో ప్రియాంక జైన్ తన తల్లిదండ్రులకు పెళ్లి చేసి రియల్ హీరోయిన్ అనిపించుకున్నదని తెలియజేసింది ఝాన్సీ.

తల్లిదండ్రులకు కూతురు పెళ్లి చేయడం అన్నది సినిమాలలో, సీరియల్స్ లో చూసి ఉంటాం.

కానీ నిజ జీవితంలో తల్లిదండ్రులకు పెళ్లి చేసింది ఈ బంగారు తల్లి అంటూ ప్రియాంక జైన్ ని పొగడ్తలతో ముంచెత్తింది ఝాన్సీ.అనంతరం వారి తల్లిదండ్రులకు ఈ ప్రేమ పెళ్లి అని చెబుతూ ప్రియాంక జైన్ కాస్త ఎమోషనల్ అయ్యింది.అదే సందర్భంలో ఆమె పేరెంట్స్ స్టేజి పైకి రావడంతో ఎమోషనల్ గా తన తల్లిదండ్రులను హత్తుకుని ఏడ్చేసింది.అనంతరం స్టేజ్ పై ఆమె తల్లిదండ్రులు దండలు మార్చుకున్నారు.

ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన స్టార్ మా వాళ్ళకి ధన్యవాదాలు అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది ప్రియాంక జైన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube