సాధారణంగా ఒకసారి విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకుంటే సమాజం నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి.అయితే ప్రముఖ హాలీవుడ్ నటీమణులలో ఒకరైన పమేలా అండర్సన్ మాత్రం ఇప్పటికే నాలుగుసార్లు వేర్వేరు కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.
ఈ నటి ఐదో పెళ్లి కూడా పెటాకులైందని త్వరలో ఈ నటి ఐదో భర్తకు కూడా విడాకులు ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ఈ నటి వయస్సు 54 సంవత్సరాలు కాగా 2020 సంవత్సరంలో ఈ నటి ఐదో పెళ్లి చేసుకుంది.
ఈ నటి ఐదో పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమె బాడీగార్డ్ కావడం గమనార్హం.బాడీగార్డ్ డాన్ హేపస్ట్ తో ప్రేమలో పడిన పమేలా అండర్సన్ లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి బంధం ద్వారా కలకాలం కలిసి ఉందామని భావించిన ఈ జంట విడాకుల కొరకు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం.
అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి పమేలా అండర్సన్ స్పందించాల్సి ఉంది.1995 సంవత్సరంలో ఈ నటి మొదటి వివాహం జరిగింది.
టామీ లీ అనే వ్యక్తిని పమేలా పెళ్లి చేసుకోగా ఈ జంటకు ఇద్దరు కొడుకులు జన్మించారు.అయితే కొన్నేళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత 2006 సంవత్సరంలో కిడ్ రాక్ అనే సంగీతకారుడిని పెళ్లి చేసుకున్నారు.
అయితే కిడ్ రాక్ తో కూడా ఈ నటి విడిపోయారు.
ఆ తర్వాత 2014 సంవత్సరంలో రిక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పమేలా వార్తల్లో నిలిచారు.అయితే వేర్వేరు కారణాల వల్ల మూడో భర్తతో కూడా ఈ నటి విడిపోయారు.ఆ తర్వాత 2020 సంవత్సరంలో ప్రొడ్యూసర్ జాన్ పీటర్స్ ను ఈ నటి వివాహం చేసుకోగా కొన్ని నెలలకే ఆమె భర్తతో విడిపోయారు.
ఐదో భర్తతో కూడా పమేలా విడాకులు తీసుకుంటూ ఉండటంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.