వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుండే హడావుడి అవసరమా?

ప్రతి సంవత్సరం సంక్రాంతి కి భారీ నుండి అతి భారీ చిత్రాలు మరియు చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా కామన్‌ విషయం.

ఈసారి కూడా చాలా మంది హీరో ల సినిమా లు వస్తాయని అనుకుంటే అనూహ్యం గా కరోనా థర్డ్‌ వేవ్ కారణంగా కేవలం బంగార్రాజు సినిమా తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మూడవ వేవ్ ప్రభావం లేకుండా ఉంటే కచ్చితంగా ఆర్ ఆర్‌ ఆర్‌ మరియు రాధే శ్యామ్‌ ఇంకా కొన్ని పెద్ద సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చి ఉండేవి.కాని ఈసారి మాత్రం థర్డ్‌ వేవ్‌ భయంతో పెద్ద సినిమాలు పక్కకు తప్పుకున్నాయి.అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కి మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా పలువురు హీరోలు ఇప్పటి నుండే క్యూ కడుతున్నారు.2023 సంక్రాంతి బెర్త్‌ ను రామ్‌ చరణ్‌ మరియు శంకర్ ల మూవీ కన్ఫర్మ్‌ చేసుకుంది.రామ్‌ చరణ్ ఇటీవలే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

అంతే కాకుండా దిల్ రాజు కూడా మొన్నటికి మొన్న ప్రకటించాడు.కనుక 2023 సంక్రాంతికి రామ్‌ చరణ్ మరియు శంకర్ ల మూవీ కన్ఫర్మ్‌ అయ్యింది.ఇక ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివల కాంబోలో రూపొందబోతున్న సినిమా కు సంబంధించిన విడుదల తేదీ కోసం సంక్రాంతి ని పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక సంక్రాంతి 2023 కానుకగా ప్రభాస్ నటిస్తున్న ఏదో ఒక సినిమా ను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.మొత్తంగా ఈ మూడు భారీ చిత్రాలు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ నటించబోతున్న సినిమా కూడా విడుదల అవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు.

Advertisement

ఏడాది ఉండగానే సంక్రాంతి బెర్త్‌ లను కన్ఫర్మ్‌ చేసుకునేందుకు స్టార్స్ పోటీ పడటం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు