జియో యూజర్లు ఇక మీదట ప్రతిసారి రీఛార్జ్ చేయాలిసిన పనిలేదట..!?

ప్రముఖ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో తన యూజర్లకు ఒక మంచి శుభవార్తను అందించింది.

జియో తన యాప్ లో ఒక అదిరిపోయే ఫీచర్‌ను మనకు పరిచయం చేస్తుంది.

అది ఏంటంటే యూపీఐ ఆటోపే అనే సరికొత్త ఫీచర్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది జియో.ఆ ఫిచర్ ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జియో రెండు కలిసి ఈ ఫీచర్‌ను పరిచయం చేసాయి.

ఇంకో ముఖమైన విషయం ఏంటంటే ఈ ఫీచర్ మనకు పరిచయం చేసిన మొట్టమొదటి టెలికాం కంపెనీ కూడా జియో అవ్వడం విశేషం అనే చెప్పాలి.అయితే జియో యూజర్లు ఈ ఫీచర్ ను ఉపయోగించాలంటే మై జియో యాప్‌ లోని యూపీఐ ఆటోపే ఎనేబుల్ చేసి ఉండాలి.

ఈ ఫీచర్ యొక్క ఉపయోగం ఏంటంటే.మన టాక్ టైమ్ బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే దానంతట అదే ఆటోమాటిక్ గా రీఛార్జ్ అయితుంది అన్నమాట.

Advertisement

అయితే ఇందుకోసం యూజర్లు తాము రీఛార్జ్ చేయాలనుకున్న ప్లాన్స్‌ను ముందుగా ఎంపిక చేసుకుని ఆటోపే ఫీచర్ ఎనేబుల్ చేయాల్సి  ఉంటుంది.ఇలా చేయడం ద్వారా ప్రతీసారి రీఛార్జ్ చేయాల్సిన పని లేకుండా ఆటోమెటిక్‌గా రీఛార్జ్ అవుతుంది.జియో యూజర్లు రూ.5,000 వరకు రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఈ ఫీచర్ లో ఉంది.అయితే రూ.5,000 లోపు రీఛార్జుల కోసం యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన పని లేదు.రూ.5,000 కన్నా ఎక్కువ రీఛార్జ్ అయితే కనుక యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.అలాగే మీరు ఒకవేళ రీఛార్జ్‌కు సంబంధించిన ప్లాన్ వివరాలను మార్చాలంటే మార్చుకోవచ్చు.

కాగా రీఛార్జ్ చేయాల్సిన తేదీని కూడా ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన పని లేకుండా మీ రీఛార్జ్ వేలిడిటీ పూర్తవుతుండగానే ఆటోమెటిక్‌గా రీఛార్జ్ అయిపోతుంది.దీనికోసం రిలయన్స్ జియో యూజర్లు మైజియో యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని, తమ జియో నెంబర్‌తో లాగిన్ అవ్వాలి.ఆ తరువాత హోమ్ స్క్రీన్‌లో కజిపించే మొబైల్ ట్యాబ్ పైన క్లిక్ చేసి రీఛార్జ్ అండ్ పేమెంట్స్ సెక్షన్‌ ను ఎంపిక చేసుకుని జియో ఆటోపే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే జియో ఆటోపే యాక్టివేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.

అందులో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ సెలెక్ట్ చేసిన తరువాత యూపీఐ, బ్యాంక్ అకౌంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి.ఆ తర్వాత మీ యూపీఐ ఐడీ ఎంటర్ చేసి, వెరిఫికేషన్ పూర్తైన తర్వాత ఆటోపే ఎనేబుల్ అవుతుంది.

ఒకవేళ మీరు ప్లాన్ మార్చాలనుకుంటే సెట్టింగ్స్‌ లోకి వెళ్లి మార్చుకోవచ్చు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు