సింహం పిల్ల‌ను ఎత్తుకెళ్తున్న అమ్మాయి.. వీడియో చూస్తే వ‌ణుకే..

అమ్మాయి అయినా సాహసం చేస్తే.పొగడ్తలతో ముంచెత్తుతారు.

మరికొందరైతే సింగం పిల్లా అంటూ కొనియాడతారు.

మరీ, నిజంగా సింహాన్ని తన చేతులతో ఎత్తుకుంటే ఆ అమ్మాయిని ఏమనాలి.

వీర నారి అంటూ పిలవాలేమో.తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కువైట్‌లో జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.కువైట్‌లో క్రూర జంతువులను పెంచుకోవడం అక్కడి జనాలకు అలవాటు.

Advertisement

ఇందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.అలా ఓ కుటుంబం కూడా సింహం పిల్లను పెంచుకుంటుంది.

అయితే అది ఓసారి ఇంటి నుంచి బయటకు వచ్చి కనిపించకుండపోయింది.దీంతో సదరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒకపక్క పోలీసులు, మరోపక్క కుటుంబ సభ్యులు సింహం కోసం వెతుకులాట ప్రారంభించారు.అర్ధరాత్రి సమయంలో సమీపంలో ఉన్న ఫ్లే గ్రౌండ్ వద్ద సింహం ఉన్నట్లు వారికి సమాచారం అందింది.

వెంటనే ఆ కుటుంబానికి చెందిన ఓ యువతి అక్కడికి వెళ్లింది.సింహాన్ని తన చేతుల్లో తీసుకొని ఇంటికి తీసుకెళ్లింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.ఆమె తన చేతుల్లోకి సింహాన్ని తీసుకున్నాక అది గట్టిగా అరుస్తుంది.

Advertisement

ఇందుకు సంబంధించిన దృష్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ గురయ్యారు.

ఇప్పటికే ఈ వీడియోకు 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

లైకులు, కామెంట్లు, షేర్‌లతో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.

సింహాన్ని అలా చేతులతో ఎత్తుకోవడం చూస్తుంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి’ అంటూ ఒకరు కామెంట్ చేశారు.సింహం మిస్సింగ్‌పై అక్కడి ప్రభుత్వానికి సమాచారం అందింది.

అయితే పోలీసులు వచ్చే‌లోపే సదరు కుటుంబానికి చెందిన మహిళ సింహాన్ని పట్టుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

తాజా వార్తలు