ఇటీవలే బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయం అందుకున్నారు.చాలా రోజుల తర్వాత వచ్చిన విజయంతో బాలయ్య తో పాటు ఆయన అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు.
బోయపాటి, బాలయ్య కాంబో మరొకసారి సూపర్ హిట్ అని వీరు నిరూపించారు.ఈ సినిమా తర్వాత బాలయ్య మరొక సినిమాను స్టార్ట్ చేసాడు.
యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన తర్వాత సినిమా చేయబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
ఈ జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ అధికారికంగా ప్రకటించారు.
మాస్ అండ్ కమర్షియల్ చిత్రం వీరిద్దరి కాంబోలో NBK107 సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నటించబోయే నటీనటుల గురించి రోజుకొక అప్డేట్ రూపంలో మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ప్రకటించారు.ఇక ఇటీవలే స్టార్ హీరో దునియా విజయ్ నటించబోతున్నారని మేకర్స్ అనౌన్స్ చేసింది.

శాండిల్ వుడ్ స్టార్ అయినా దునియా విజయ్ తన మొదటి సినిమాతోనే మంచి పవర్ ఫుల్ రోల్ లో ప్రతినాయకుడిగా కనిపించ బోతున్నాడు.అందులోను బాలయ్య సినిమా కావడంతో ఈయనకు మంచి పేరు రావడం ఖాయం.

ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరొక కీలక పాత్రలో ఎవరు నటిస్తున్నారో అనేది అనౌన్స్ చేసారు.తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించ బోతున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.గత ఏడాది గోపీచంద్ మలినేని, రవితేజ కాంబోలో వచ్చిన క్రాక్ సినిమాలో వరలక్ష్మి జయమ్మ అనే పవర్ ఫుల్ నెగెటివ్ రోల్ లో కనిపించి తెలుగులో ఫుల్ పాపులారిటీని తెచ్చుకుంది.ఇక మరొకసారి గోపీచంద్ మూవీలో ఈమెకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది అది కూడా బలమైన పాత్ర అనే తెలుస్తుంది.







