సంక్రాంతి సీజన్ వచ్చేసింది.ఇప్పుడు ఎక్కువగా వినపడే పదం జల్లికట్టు.
ప్రతి పల్లెటూరిలో ఈ జల్లికట్టు పోటీలు జరగడం విశేషం.ప్రతిసారీ జల్లికట్టులో చాలా మంది గాయాలు పాలవుతుంటారు.
కొన్నిసార్లు అయితే ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.అయినా వాటిని లెక్కచేయకుండా జల్లికట్టును నిర్వహిస్తుంటారు.
తాజాగా తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో జల్లికట్టు జరిగింది.అయితే నిబంధనలకు విరుద్దంగా ఈ జల్లికట్టు జరిగింది.నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు జల్లికట్టు పోటీలు పెట్టారు.ఆ టైంలో ఓ ఎద్దు విరుచుకుపడింది.రంకెలేసుకుంటూ జనంపైకి పరుగులు తీసింది.అదే సమయంలో అటుగా ఓ ద్విచక్రవాహనం వెళ్తుండగా దానిపైకి ఆ ఎద్దు దూసుకెళ్లింది.
బైక్ వెనక కూర్చున్న మహిళను ఆ ఎద్దు బలంగా ఢీకొట్టడంతో ఆ మహిళకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.తమిళనాడులో ఈ జల్లికట్టు పోటీలు నిర్వహించగా ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిరువన్నమలై జిల్లా కన్నమంగళంలో వార్షిక జల్లికట్టు ఉత్సవాలు నిర్వహించారు.
ఆ జల్లికట్టు పోటీలకు జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు.పోటీలకు అనుమతులు ఇవ్వకపోయినా నిబంధనలను తుంగలో తొక్కి స్థానికులు ఆ ఉత్సవాలను నిర్వహించారు.
పోటీల్లో పాల్గొనేందుకు వెల్లూరు, రాణిపెట్టై, కంచి పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది జనం అక్కడికి తరలి వచ్చారు.ఒక ఎద్దు రంకెలేసుకుంటూ ప్రజలపైకి వెళ్లింది.
ఆ ఎద్దును ఎవ్వరూ అదుపు చేయలేకపోయారు.కొందరు విఫలయత్నం చేసినా లాభం లేదు.
బైక్ వెనుక కూర్చున్న మహిళను ఆ ఎద్దు బలంగా ఢీకొట్టడంతో ఆమె ఎగిరిపడింది.ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ మహిళ చికిత్స పొందుతోంది.
నిబంధనలు పట్టించుకోకుండా పోటీలు నిర్వహించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు.పోటీలు నిర్వహించేవారిపై కేసు నమోదు చేశారు.