ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు ఒమిక్రాన్ దెబ్బ భారీగా తగిలిందని చెప్పవచ్చు.అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమాలు సంక్రాంతి బరిలో పోటీపడగా ఒమిక్రాన్ కారణంగా ఈ సినిమాలన్నీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాయి.
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా వాయిదా పడగా.అదే దారిలోనే ప్రభాస్ రాధేశ్యామ్ పయనిస్తోంది.
రాజమౌళి సినిమా విడుదల వాయిదా వేస్తూ నిర్మాత డి.వి.వి.దానయ్య అధికారికంగా ప్రకటన చేయడంతో అభిమానులు ఎంతో అసహనానికి గురయ్యారు.
ఈ సినిమా విడుదల వాయిదా వేయడంతో ప్రభాస్ అభిమానులలో కూడా భయం మొదలైంది.అందరూ ఊహించిన విధంగానే ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా విడుదల కూడా వాయిదా వేసినట్లు డైరెక్టర్ రాధాకృష్ణ అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రాధాకృష్ణ ద్వారా ట్వీట్ చేస్తూ….
సమయం ఎంతో కఠినమైనది, హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి.

మనపైకి ఏది విసిరినా – మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి.జాగ్రత్తగా ఉన్నంత లో ఉండండి’ అంటూ ట్వీట్ చేశాడు.ఇక ఈ ట్వీట్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా కూడా వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది.ఇలా ఈ సినిమా వాయిదా గురించి పూర్తిగా క్లారిటీ ఇవ్వక పోయినప్పటికీ డైరెక్టర్ ఉద్దేశం మాత్రం అదేనని పలువురు భావిస్తున్నారు.
ఇదే విషయాన్ని డైరెక్టర్ ని డైరెక్ట్ గా అడగడంతో అలాంటిదేమైనా ఉంటేప్రకటిస్తామని తెలియజేశారు గాని ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వకపోవడంతో మరోసారి అభిమానులు సందిగ్దంలో పడ్డారు.







