ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి ప్రస్తుతం చేతిలో అయిదు ఆరు సినిమాలను కలిగి ఉంది.ఉప్పెన సినిమా లో ఈమె కమిట్ అయిన పారితోషికం తక్కువే ఉంది.
కాని ఉప్పెన తర్వాత కమిట్ అయిన సినిమా లకు గాను ఈమె కోటికి పైగానే పారితోషికంను దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇటీవల నానితో కలిసి నటించిన శ్యామ్ సింగ రాయ్ కూడా ఈమె కు విజయాన్ని తెచ్చి పెట్టింది.
ఆ సినిమా లో ఈ అమ్మడి అందాల ఆరబోత మరియు ముద్దు సీన్స్ తో యూత్ లో మరింత గా క్రేజ్ ను దక్కించుకుంది.దాంతో ఉప్పెన బ్యూటీ కాస్త శ్యామ్ సింగ రాయ్ బ్యూటీగా మారి పోయింది.ఇప్పుడు ఈమె కొత్తగా నటించే సినిమా లకు ఏకంగా 1.75 నుండి 2 కోట్ల వరకు పారితోషికంను డిమాండ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.

ఆ విషయంలో కృతి శెట్టి యంగ్ హీరోలను కూడా డామినేట్ చేస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.తాజాగా ఈమె ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా లో సుధీర్ బాబు కు జోడీగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయ్యింది.ఆ సినిమా లో నటించేందుకు గాను సుధీర్ బాబు కంటే కూడా అధికంగా బేబమ్మ కృతి శెట్టి పారితోషికం అందుకుంటుంది అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఆ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని సుధీర్ బాబు సినిమాకు గాను ఆమె రెండు కోట్ల వరకు పారితోషికంను అందుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ముందు ముందు ఈ అమ్మడు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.