టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు .వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ జంట వారిద్దరి విషయాల గురించి వస్తున్న వార్తలఫై ఇంతవరకు స్పందించలేదు.ఇకపోతే వీరిద్దరూ కలిసి గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత వీరిద్దరూ సినిమాల్లో కలిసి నటించిక పోయినప్పటికీ అక్కడక్కడా కలుస్తూ మీడియా కంట పడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే పలుసార్లు ఈ జంట మీడియా కంటపడిన విషయం తెలిసిందే.
వీరిద్దరూ కలసి ముంబైలో పలుమార్లు డిన్నర్ డేట్స్ కి వెళుతూ కెమెరాలకు చిక్కారు.దీంతో ఈ జంట కి సంబంధించిన ఈ వార్త వినిపించిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే ఈ జంట న్యూ ఇయర్ కి ఈ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.అయితే కొత్త సంవత్సరంలో వీరిద్దరూ కలిసి రిలేషన్ గురించి ప్రకటించబోతున్నారా? లేకపోతే కొత్త సినిమాకు సంబంధించిన ప్రాజెక్టు ప్రకటించ పోతున్నారా?అంటూ రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ జంట న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి సర్ప్రైస్ ఇస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.ఇకపోతే విజయ్ దేవరకొండ, రష్మిక ప్రస్తుతం గోవాలో హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ జంట గోవాకు పయనమయ్యారని,అక్కడ న్యూ ఇయర్ కి సంబంధించిన సెలబ్రేషన్స్ చేసుకోనున్నారు అని సమాచారం.ఇకపోతే విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.
విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.