న్యూ ఇయర్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ `హైవే` మూవీ కొత్త పోస్టర్ విడుదల..

యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా హైవేప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది.నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా హైవే చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత‌ వెంకట్‌ తలారి.

 Anand Deverakonda Highway Movie New Poster Relesed, Anand Deverakonda, Highway-TeluguStop.com

న్యూ ఇయర్ సందర్భంగా హైవే చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

ఆనంద్ దేవరకొండ తీక్షణంగా చూస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్ పక్కన ఇతర క్యారెక్టర్స్ ను చూపించారు.కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆనంద్ కు `హైవే`మరొక కొత్త తరహా సినిమా కానుందని తెలుస్తోంది.ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

నటీనటులు:

ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌, అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్, సత్య, జాన్ విజయ్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్‌, నిర్మాత: వెంకట్‌ తలారి, బేనర్‌: శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌, సంగీతం: సైమన్‌ కె.కింగ్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube