డైటింగ్ చేయ‌కుండానే బ‌రువు త‌గ్గాలా? అయితే మీరీ జ్యూస్ తాగాల్సిందే!

ఇటీవ‌ల రోజుల్లో బ‌రువు త‌గ్గేందుకు దాదాపు అంద‌రూ వ్యాయామాల‌తో పాటు డైటింగ్ కూడా చేస్తున్నారు.డైటింగ్‌లోనే వేగన్ డైట్, లో-కార్బ్ డైట్, జోన్ డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, లో-ఫ్యాట్ డైట్‌, లిక్విడ్ డైట్‌, డిటాక్స్ డైట్ ఇలా ఎన్నో ర‌కాలు ఉన్నాయి.

 Drinking This Juice Will Help You Lose Weight Without Dieting! Dieting, Lose Wei-TeluguStop.com

ఎవ‌రికి  న‌చ్చిన దాన్ని వారు ఎంచుకుంటూ వెయిట్ లాస్ అయ్యేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటారు.అయితే డైటింగ్ చేయ‌కుండా కూడా బ‌రువు త‌గ్గొచ్చు.

అవును, ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను తీసుకుంటే గ‌నుక డైటింగ్‌తో ప‌ని లేకుండానే వెయిట్ లాస్ అవ్వొచ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ జ్యూస్ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? ఎప్పుడు తాగాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

డైటింగ్ చేయ‌కుండానే బ‌రువు త‌గ్గాల‌ని కోరుకునే వారికీ కీర‌దోస‌-పుదీనా జ్యూస్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఈ జ్యూస్‌ను ఎలా త‌యారు చేసుకోవాలంటే.ముందుగా ఒక బ్లెండ‌ర్‌ తీసుకుని అందులో ఒక క‌ప్పు కీర దోస ముక్క‌లు, అర క‌ప్పు పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క వేసుకుని వాట‌ర్‌తో బ్లెండ్ చేసుకుంటే జ్యూస్ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ జ్యూస్‌లో ఒకటి లేదా రెండు స్పూన్ల నిమ్మ ర‌సం క‌లుపుకుని ఉద‌యం పూట తీసుకోవాలి.ఈ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది.అతి ఆక‌లి త‌గ్గు ముఖం ప‌డుతుంది.మ‌రియు ఈ జ్యూస్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లిగి చిరు తిండ్ల‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.

ఫ‌లితంగా మీరు క్ర‌మంగా బ‌రువు త‌గ్గుతారు.ఈ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు కరుగుతుంది .

ఇక కీర‌దోస, పుదీనా జ్యూస్‌ను సేవించ‌డం వ‌ల్ల శరీరంలోని వ్య‌ర్థాలు, విష పదార్ధాలు బ‌య‌ట‌కు వెళ్లి పోయి లివ‌ర్‌, కిడ్నీలు శుభ్ర ప‌డ‌తాయి.అంతే కాదు, ఈ జ్యూస్‌ను తీసుకుంటే క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతి వంతంగా మారుతుంది.మ‌రియు ర‌క్త పోటు స్థాయిలు సైతం అదుపులో ఉంటాయి.

Weight Loss Without Dieting Just Drink This Juice #Health

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube