నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ లవ్ స్టోరీ.శ్రీవెంకటేశ్వర సినీమాస్ బ్యానర్ లో ఏసియన్ నారాయణ దాస్, సునీల్ నారంగ్ ఈ సినిమా నిర్మించారు.సినిమా థియేట్రికల్ రిలీజై సూపర్ సక్సెస్ కాగా రీసెంట్ గా బుల్లితెర మీద కూడా సినిమా బ్లాక్ బస్టర్ రేటింగ్ తెచ్చుకుంది.18.1 టీ.ఆర్.పి రేటింగ్స్ తో లవ్ స్టోరీ రికార్డ్ సృష్టించింది.
మాములుగా అయితే ఓటీటీలు వచ్చాక బుల్లితెర మీద సినిమాలు చూసే ఆడియెన్స్ సంఖ్య తగ్గింది.
అయితే కొన్ని సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ హిట్ అవగా స్మాల్ స్క్రీన్ పై పేలవమైన ప్రదర్శన ఇస్తున్నాయి.అయితే లవ్ స్టోరీ మాత్రం అక్కడ ఇక్కడ హిట్ అయ్యింది.స్టార్ మాలో టెలికాస్ట్ అయిన లవ్ స్టోరీకి 18.1 రేటింగ్ రావడం విశేషం.ఈ సినిమాతో నాగ చైతన్య తన ఖాతాలో మరో సూపర్ హిట్ వేసుకున్నాడు.లవ్ స్టోరీ స్మాల్ స్క్రీన్ పై అంత రేటింగ్ తెచ్చుకోవడానికి సాయి పల్లవి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని అంటున్నారు.
ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడే సాయి పల్లవి సినిమాను స్మాల్ స్క్రీన్ పై ఫ్యామిలీస్ ఎక్కువగా చూసి ఉంటారని చెప్పుకుంటున్నారు.