సాధారణంగా మనం రోడ్డుపై వెళ్తున్న సమయంలో లేదా ఏదైనా పనులు చేస్తున్న సమయంలో మనకు కొన్నిసార్లు చిల్లర నాణేలు దొరుకుతుంటాయి.ఇలా చిల్లర నాణేలు కనిపించినప్పుడు చాలా మంది వాటిని తీసుకోవడానికి ఆలోచిస్తే మరికొందరు మాత్రం అలాంటి డబ్బులను తీసుకోవడానికి ఏమాత్రం ఆలోచించరు.
అయితే ఇలా రోడ్డుపై పడిన డబ్బులను తీసుకోవడం దేనిని సూచిస్తుంది అనే విషయానికి వస్తే మొదటగా మనకు రోడ్డుపై ఎక్కడన్నా చిల్లర నాణాలు కనిపిస్తున్నాయంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా స్మశానవాటిక ఉందో లేదో గమనించుకోవాలి.ఇలా ఒక మృతదేహాన్ని అంతిమ యాత్ర తీసుకువెళ్తున్న సమయంలో ఇలా చిల్లర వేస్తూ వెళ్తారు.
అందుకోసమే మనకు రోడ్డు పై చిల్లర కనిపించినప్పుడు ముందుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించాలి.ఒకవేళ స్మశాన వాటిక లాంటి పరిస్థితులు మనకు కనిపించకపోతే ఆ చిల్లర తీసుకుని దేవుని సన్నిధిలో వేసి ఈ డబ్బులు పోగొట్టుకున్న వారికి మంచి జరగాలని ప్రార్ధించి ఆ డబ్బులను హుండీలో వేయాలి.
ఇలా దొరికిన డబ్బులను తీసుకోవటంవల్ల ఆ డబ్బు పోగొట్టుకున్న వారి ఆవేదనన, బాధ మనకు కలుగుతాయి.అందుకోసమే ఆ డబ్బులను దేవుని సన్నిధిలో వేసి ఆ డబ్బు పోగొట్టుకున్న వారికి మంచి జరగాలని మాత్రమే ప్రార్థించాలి.

ఒకవేళ మీరు ఆలయానికి వెళ్లే పరిస్థితి లేనప్పుడు మీకు దొరికిన డబ్బును దారిలో బిక్షం వేసే వెళ్ళిన మీకు ఎలాంటి పాపం లేకుండా పుణ్యం కలుగుతుంది.అందుకోసమే రోడ్డుపై దొరికిన డబ్బులను ఎప్పుడూ కూడా మన వద్ద ఉంచుకోకూడదు.మరి కొందరిలో లక్ష్మీదేవి ఏరికోరి మన ఇంటికి వస్తే మనం ఎందుకు తీసుకోకూడదు అనే ప్రశ్న కూడా కలుగుతుంది.అయితే మనం కష్టపడి సంపాదించిన డబ్బును కూడా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో దేవుడి హుండీలో వేస్తాము.
కావాలని వేయడం లేదు అయితే మనకు దొరికిన లక్ష్మి వేరే వాళ్లు పోగొట్టుకున్న లక్ష్మీదేవి కానీ మనం కష్టపడితే వచ్చినది కాదు కనుక ఇతరుల డబ్బును తీసుకునే హక్కు మనకు లేదు.రోడ్డు పై పడిన డబ్బులు తీసుకుంటే ఒకరి మనోవేదనను మనం అనుభవించినట్లు అందుకే రోడ్డు పై పడిన డబ్బులను తీసుకోకూడదని చెప్పారు.