యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ వల్ల బిజీగా ఉన్నారు.ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న ఆర్ఆర్ఆర్ ఈవెంట్లకు హాజరవుతూ ఎన్టీఆర్ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.
ట్రైలర్ లో కొమురం భీమ్ లుక్ తో జూనియర్ ఎన్టీఆర్ మెప్పించారు.అయితే బెంగళూరుకు ప్రమోషన్స్ కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ పునీత్ రాజ్ కుమార్ ను తలచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
పునీత్ రాజ్ కుమార్ లేని కర్ణాటక తనకు శూన్యంలా అనిపిస్తోందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.పునీత్ రాజ్ కుమార్ లేని లోటును ఎవరూ పూడ్చలేరని ఎన్టీఆర్ వెల్లడించారు.
ఇతర భాషల నటులు కూడా పునీత్ రాజ్ కుమార్ ను మిస్ అవుతున్నారని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.పునీత్ రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నా ఆయనకు తన ఆశీస్సులు ఉంటాయని ఎన్టీఆర్ అన్నారు.
ఎన్టీఆర్ గెలీయా గెలీయా పాటను పాడి పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించడం గమనార్హం.
పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చక్రవ్యూహ సినిమా లోని పాటను జూనియర్ ఎన్టీఆర్ పాడారు.

ప్రముఖ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం గమనార్హం.అక్టోబర్ నెల 29వ తేదీన కార్డియాక్ అరెస్ట్ వల్ల పునీత్ రాజ్ కుమార్ చనిపోయారు.తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది సినీ ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు హాజరయ్యారు.

ఊహించని స్థాయిలో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా పునీత్ రాజ్ కుమార్ కు అభిమానుల సంఖ్య పెరిగింది.పునీత్ రాజ్ కుమార్ మరణం.కోట్ల సంఖ్యలో ఉన్న పునీత్ రాజ్ కుమార్ అభిమానులను బాధ పెట్టడం గమనార్హం.
పునీత్ తాను రీల్ హీరో మాత్రమే కాదని రియల్ హీరో అని ప్రూవ్ చేసుకున్నారు.







