తెలుగు ఇండస్ట్రీతో పాటు మిగిలిన అన్ని ఇండస్ట్రీలలో స్టార్ హీరోలకు అనుగుణంగా దర్శకనిర్మాతలు కథలు రాస్తూ ఉంటారు.ఆ హీరో అభిమానులు ఆ హీరో నుంచి ఏం కోరుకుంటున్నారో అనే విషయాన్ని అర్థం చేసుకొని కథలు రాస్తారు.
తాజాగా విడుదలైన అఖండ సినిమా ఈ కోవకే చెందుతుందని చెప్పవచ్చు.ఇక పోతే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో పవన్ ఉన్నాడు అంటే కథ కూడా చిన్నగా మారిపోతుంది.
అంతటి స్టార్డమ్ పవన్ కళ్యాణ్ సొంతం.అందుకోసమే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
మలయాళం సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్ గా తెలుగులో భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కుతోంది.ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు మరొక హీరో రానా కూడా నటిస్తున్నాడు.
భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు సరిపోయేలా కథలో పలు మార్పులు చేస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.

అయితే ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నది మాత్రం త్రివిక్రమ్. మలయాళం సినిమాలో ఎక్కువగా ఎమోషనల్ సన్నివేశాలు ఉండవు, కానీ తెలుగులో ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా కనిపించబోతున్నాయి.మరొకవైపు భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ నిత్యమీనన్ మధ్య రోమాంటిక్ ట్రాక్ ను కూడా పెట్టాడు త్రివిక్రమ్ ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.