మొదటి రెండు నెలల్లో భారీ అతి భారీ 15 సినిమాలు.. ఒమిక్రాన్‌ ఏం చేసేనో?

కరోనా వల్ల అన్ని సినిమా పరిశ్రమల వల్లే టాలీవుడ్ కూడా చాలా నష్టపోయింది.

అయితే ఇతర పరిశ్రమలతో పోల్చితే టాలీవుడ్‌ లో ఎక్కువ సినిమా లు కరోనా సమయంలో అంటే ఈ రెండేళ్ల సమయంలో వచ్చాయి అనడంలో సందేహం లేదు.

ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా పూర్తిగా మూత పడ్డ సమయంలో కూడా ఉప్పెన వంటి సినిమా వచ్చి వంద కోట్ల వసూళ్లు దక్కించుకున్న చరిత్ర ఉంది.అందుకే టాలీవుడ్‌ లో సినిమా లు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సక్సెస్ అవుతాయి అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.

పరిస్థితులు ఎలా ఉన్నా కూడా జనాలు సినిమా బాగుంటే చూసేందుకు క్యూలు కడతారు.ఆ నమ్మకంతోనే 2022 లో జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఏకంగా 15 పెద్ద సినిమా లు రంగంలోకి దిగుతున్నాయి.

వాటికి ఒమిక్రాన్‌ భయం తప్పడం లేదు.

Advertisement

ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగి పోయింది.దాంతో రాబోయే రెండు నెలలు పరిస్థితి ఎలా ఉంటుందని అంతా ఆందోళనతో ఉన్నారు.కొందరు ఏకంగా లాక్ డౌన్‌ అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు.

ఆర్ ఆర్‌ ఆర్‌ నుండి మొదలుకుని రాధే శ్యామ్‌, భీమ్లా నాయక్‌, బంగార్రాజు, ఆచార్య, ఎఫ్‌ 3 ఇంకా ఇంకా చాలా చాలా సినిమా లు సంక్రాంతి నుండి ఫిబ్రవరి ఎండ్‌ వరకు ఉన్నాయి.ఈ సినిమా ల్లో భారీ నుండి అతి భారీ సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ మొత్తం సినిమాల విలువ దాదాపుగా అయిదు కోట్లు అంటున్నారు.కనుక ఫలితం కాస్త అటు ఇటు అయినా అంతో ఇంతో వసూళ్లు నమోదు అవుతాయి.

కాని ఒక వేళ సినిమా లు ఒమిక్రాన్ వల్ల ఆగిపోతే పరిస్థితి ఏంటి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏం జరుగబోతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు