బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కావడానికి అసలు కారణాలివే?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో ప్రియాంక సింగ్ ఒకరు.

బిగ్ బాస్ సీజన్ 5లో ప్రియాంక సింగ్ ఏకంగా 13 వారాల పాటు హౌస్ లో ఉన్నారు.

ట్రాన్స్ జెండర్ అయిన ప్రియాంక సింగ్ తన ప్రవర్తనతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడంతో ఎలిమినేషన్ కు చాలాసార్లు నామినేట్ అయినా సేవ్ అవుతూ వచ్చారు.హౌస్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేసే విషయంలో ప్రియాంక సింగ్ ముందువరసలో ఉండేవారు.

అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.నచ్చిన వాళ్ల కోసం ఏమైనా చేసే ప్రియాంక సింగ్ ను అందరూ ముద్దుగా పింకీ అని పిలిచేవారు.

బిగ్ బాస్ హౌస్ లో పింకీ మానస్ తో సన్నిహితంగా ఉండేవారు.బిగ్ బాస్ హౌస్ లో మానస్ ముఖ్యం అనే విధంగా ప్రవర్తించడం ఒక విధంగా ప్రియాంకకు మైనస్ అయింది.

Advertisement

ఎక్కువ సమయం కిచెన్ లో ఉండటం కూడా ప్రియాంకకు నెగిటివ్ అయింది.

మెజారిటీ టాస్కులలో మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోవడం కూడా ప్రియాంకకు మైనస్ అయిందని చెప్పవచ్చు.ప్రతి నిర్ణయానికి ఇతరులపై ఆధారపడటం కూడా ప్రియాంకకు నెగిటివ్ గా మారింది.13వ వారం మానస్ కూడా నామినేషన్ లో ఉండటంతో మానస్ ఫ్యాన్స్ పింకీకి ఓట్లు వేయలేదు.అలా కాకుండా మానస్ నామినేషన్ లో లేకుండా ఉండి ఉంటే మాత్రం పింకీ సేవ్ అయ్యేవారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పింకీ ఎలిమినేట్ కావడంతో ఆమె అభిమానులు బాధ పడుతున్నారు.బిగ్ బాస్ హౌస్ లో సొంత వైద్యం చేయడం కూడా పింకీకి మైనస్ అయింది.మంచి ఉద్దేశంతో సహాయం చేసి పింకీ చేతులు కాల్చుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు