ఎన్నికల సంఘానికి టీడీపీ లేఖ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.

అధికార పార్టీ వైసీపీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నట్లు ఆరోపణలు చేస్తూ ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ లెటర్ రాయడం జరిగింది.

గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో అనుసరించిన విధానాన్ని జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేయడానికి వైసీపీ పావులు కదుపుతోంది అని లెటర్లో టిడిపి ఫిర్యాదు చేయడం జరిగింది.ముఖ్యంగా నకిలీ గుర్తింపు కార్డులతో.

దొంగ ఓట్లు వేయించి.గెలిచే తరహాలో కుట్ర పన్నినట్లు టీడీపీ లేఖలో స్పష్టం చేయడం జరిగింది.

ఈ క్రమంలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ పంచాయతీ ఎన్నికలలో దొంగ ఓట్లు వేయించడానికి ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులను రంగంలోకి దింపుతున్న ట్లు తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని.

Advertisement

ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.టీడీపీ లేఖలో అభ్యర్థించడం జరిగింది.

 జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎక్కడా కూడా హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఈసీ చూసుకోవాలని.టీడీపీ లేఖలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు