పాపం నయనతార.. అతని ప్రేమలో పడి కారు ఈఎంఐ కట్టలేక ఎన్ని కష్టాలో?

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నయనతార.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

 Nayantara Fell In Love With Him And She Face Struggles To Pay Car Emi, Nayantara-TeluguStop.com

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఇక నయనతార నటిగా ఎంత గుర్తింపు తెచ్చుకుందో.

వ్యక్తిగతంగా అంతా హాట్ టాపిక్ గా మారింది.ఇదిలా ఉంటే నయనతార గతంలో ఒక అతనితో ప్రేమలో పడి తన కారు ఈఎంఐ కూడా కట్టలేదట.ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

2003లో మలయాళం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది నయన.ఇక 2006లో లక్ష్మి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించాడు.

ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వడంతో.అదే ఏడాది మరో స్టార్ హీరో నాగార్జున సరసన బాస్ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

అలా ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలోనే నటించింది.

వీటితో పాటు తమిళ భాషల్లో కూడా నటించింది.

అలా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నయనతారకు మంచి క్రేజ్ రావడంతో పాటు మంచి పారితోషికం కూడా అందింది.దాదాపు అప్పట్లోనే ఒక సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకునే నయనతార తన కారు ఈఎంఐ కట్టలేకపోయింది.

దీంతో అప్పుడు ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా మారింది.

Telugu Car Emi, Love, Nayantara, Struggles, Tollywood-Movie

అప్పటికే నయనతార మరో స్టార్ హీరో ప్రభుదేవాతో లవ్ ఉండటంతో టాలీవుడ్ లో బాగా చర్చలు జరుగుతున్న వేళ అది.అదే సమయంలో తాను తన బీఎండబ్ల్యూ కారును ఇన్ స్టాల్ మెంట్స్ లో కొనుక్కుంది.నిజానికి విచిత్రమేంటంటే తాను కోటి రూపాయల పారితోషకం తీసుకుంటున్న కూడా ఇన్ స్టాల్ మెంట్ లో కారు ఎందుకు కొనుకుందో ఇప్పటికీ ఆశ్చర్యపడాల్సిన విషయమే.

అలా తాను సంపాదించిన డబ్బును ఏం చేసిందో తెలియదు కానీ ఆ సమయంలో కారు ఫైనాన్స్ వాయిదాలు కట్టకపోవడంతో ఆ కారు ఫైనాన్షియర్ బాగా విసుగు చెంది పాపం నయనతార దగ్గర ఉన్న కారును లాక్కొని వెళ్ళాడు.ఇక ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఆ కారుని చెన్నైలో కారు షో రూమ్ లో అప్పగించారు.

ఇక ఆమె డబ్బు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తో కడుతుందో అప్పుడే తనకు కారు ఇవ్వాలని చెప్పి అప్పజెప్పారట.

Telugu Car Emi, Love, Nayantara, Struggles, Tollywood-Movie

దాంతో ఆ సమయంలో మంచి హోదాలో ఉన్న నయనతారకు ఒకేసారి అలా కావడంతో బాగా పరువు పోయినట్లు అనిపించింది.ఇక ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా గుసగుసలు వినిపించాయి.ఇక కొందరు నెటిజన్లు నయనతార పై బాగా సెటైర్లు కూడా వేశారు.

నయనతార అంత సంపాదించినప్పుడు ఒకేసారి కారు కొనుక్కుంటే ఏమవుతుందో అని కామెంట్లు చేశారు.

మరికొందరు ఆ డబ్బు మొత్తం తన బాయ్ ఫ్రెండ్ ప్రభుదేవా ప్రేమలో పడి అంత అక్కడే ఖర్చు చేస్తుందేమో పాపం అని బాగా సెటైర్లు కూడా వేశారు.

ఇక ఇదంతా గతంలో జరుగగా ప్రస్తుతం మళ్లీ నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube