సొంత ఇల్లు కొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్.. మీ అందరివల్లే అంటూ ఎమోషనల్?

గుంటూరు మిర్చి అంటేనే అందరికీ టక్కున మెహబూబ్ గుర్తుకు వస్తారు.గుంటూరు మిర్చి అనే వెబ్ సిరీస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు.

యూట్యూబ్, టిక్ టాక్ వీడియోలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెహబూబ్ బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు.ఇలా బిగ్ బాస్ లో తనని తాను నిరూపించుకునీ ఎంతో పాపులారిటీ దక్కించుకున్నారు.

అయితే తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక బిగ్ బాస్ హౌస్ లో కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యాడు.అయితే తనకు చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేదని ఎప్పటికైనా సొంత ఇంటిని నిర్మించుకోవాలని తన ఆశయం కోసం మెహబూబ్ ఎంతో కష్టపడ్డారు.

ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం తనకు లభించిందని చెప్పవచ్చు.బిగ్ బాస్ ఫినాలేలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి మెహబూబ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement

మెహబూబ్ ని చూస్తుంటే తనని తాను చూసుకున్నట్టు ఉందని చిరంజీవి చెప్పిన మాటలు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి.ఈ క్రమంలోనే చిరంజీవి మెహబూబాకు 10 లక్షల ఆర్థిక సహాయం చేశారు.

బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో తన జీవితమే మారిపోయిందని ప్రస్తుతం ఎన్నో పేర్లతో ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే మహబూబ్ తన ఇంటి కలను నెరవేర్చుకున్నారు.ఎంతో అందమైన ఇంటిని నిర్మించి ఆదివారం గృహప్రవేశం చేశారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

మీ అందరి ఆశీర్వాదం వల్లే ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరి సహాయ సహకారాలు నాపై ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని మెహబూబ్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా ఫోటోను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు