మరో కొత్త పాత్ర పోషించబోతున్న మిస్టర్ కూల్..!

మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ ఆటకు అంటిపెట్టుకొనే ఉంటున్నారు.దీనితో అభిమానులు సంతోషిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ధోనీ ఫ్యాన్స్ కు మరో తీపి కబురు అందింది.తాజాగా ధోనీ ఓ క్రికెట్ అకాడమీని ప్రారంభించారు.

ఈ అకాడమీలో స్వయంగా ధోనీయే ఆసక్తి ఉన్న యువకులకు క్రికెట్ పాఠాలు చెప్పనున్నారు.బెంగళూరులోని బిదరహల్లిలోని అగ్రహారంలో ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ (MSDCA) లాంఛనంగా ప్రారంభమైంది.

మంగళవారం రోజు గేమ్‌ప్లే, ఆర్కా స్పోర్ట్స్ భాగస్వామ్యంతో ఈ అకాడమీని ధోనీ ప్రారంభించారు.కాగా ఈ అకాడమీలో ట్రైనింగ్ సెషన్స్ నవంబర్ 7 నుంచి ఆరంభమవుతాయి.

Advertisement

ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.

క్రికెటర్లు కావాలని ఆకాంక్షిస్తున్న యువతకు అన్ని కోణాల్లోనూ ట్రైనింగ్ ఇస్తాం.అలాగే టెక్నిక్స్, టెక్నాలజీతో మీ స్కిల్స్ బాగా మెరుగు పరచడమే మా ముఖ్య ఉద్దేశం.

బాగా ట్రైనింగ్ తీసుకుని అపార జ్ఞానం సంపాదించిన కోచింగ్ టీమ్ మీకు అత్యుత్తమ ట్రైనింగ్ అందిస్తుంది.వెంటనే మా అకాడమీలో చేరేందుకు రిజిస్టర్ కండి.

మా అకాడమీ సుశిక్షితులు మిమల్ని క్రికెటర్‌గా మాత్రమే కాదు తెలివైన వ్యక్తిగా మార్చేస్తారు.మానసిక, శారీరక స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి మాతో జాయిన్ అవ్వండి" అని తెలిపారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అయితే ఈ అకాడమీలో ప్రపంచ స్థాయి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయని భాగస్వామ్య క్రీడా సంస్థలు పేర్కొన్నాయి.

Advertisement

ఇకపోతే అక్టోబరులో యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ మ్యాచులు జరగనున్నాయి.ధోనీ ఈ వరల్డ్ కప్‌లో భారత క్రికెట్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.ఇందుకు ధోనీ ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదని సౌరవ్ గంగూలీ వెల్లడించారు.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ధోనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోనీ ఐపీఎల్ లో మాత్రం ఆడుతున్నారు.

ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నారు.ఈ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్ ఐపీఎల్ ఫైనల్స్‌ లో ఆడనుంది.

తాజా వార్తలు