అప్పుడు టీడీపీ ఇప్పుడు జనసేన ! బీజేపీ మాత్రం అదే ప్లేస్ లో ? 

ఏపీలో కేంద్ర అధికార పార్టీ బీజేపీ పరిస్థితి ఏమిటో అర్థం కాని విధంగానే ఉంది.

ఎప్పటి నుంచో ఏపీలో బలపడేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా, ఫలితం మాత్రం కనిపించడం లేదు.

చెప్పుకోవడానికి కేంద్ర అధికార పార్టీ హోదా కనిపిస్తున్నా, పార్టీ మాత్రం ఎక్కడ బలపడలేక పోతోంది.ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికలకు వెళ్లి 1 ,2 స్థానాల్లో గెలవడం తప్పించి, ఒంటరిగా పోటీ చేసిన ఏ సందర్భంలోనూ ఒక్క సీటును కూడా దక్కించుకోలేని పరిస్థితి ఆ పార్టీ ఎదుర్కొంటోంది.

గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సమయంలో బిజెపి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేది.టిడిపి ప్రభుత్వంలో బిజెపి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి.

దీంతో బిజెపి క్రమక్రమంగా బలపడుతోంది అనే సంకేతాలు వస్తున్న సమయంలో, రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి.దీంతో ఆ పొత్తు కాస్త రద్దయింది.

Advertisement

అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు మాత్రం బిజెపి ఏపిలో బలపడ లేకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీతో పొత్తు అని, ఆ పార్టీతో పొత్తు లేకపోతే బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉండేది అనేది వీర్రాజు అభిప్రాయం.అందుకే టీడీపీకి వీలైనంత దూరంగానే ఆయన ఉంటూ వస్తున్నారు.

ఏపీ అధికార పార్టీ వైసీపీ పై విమర్శలు కంటే టిడిపినే ఆయన మొదట్లో టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసేవారు.ఇక జనసేన పార్టీ తో ప్రస్తుతం బిజెపికి పొత్తు ఉంది.

అయితే ఎక్కడా రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లలేక పోవడం, ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండడంతో బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

ప్రస్తుతం జనసేన గ్రాఫ్ కాస్త మెరుగవ్వగా బీజేపీ పరిస్థితి మరింత దిగజారినట్టుగా కనిపిస్తోంది.ఏపీలో ఒక్క నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో బిజెపి పట్టు సాధించలేకపోయింది.2024 ఎన్నికలు వచ్చినా బీజేపీ ప్రభావం ఏమీ ఉండదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.దీనికి తోడు కేంద్ర అధికార పార్టీ బిజెపి ఏపీకి అన్యాయం చేస్తోంది అనే అభిప్రాయం ఇప్పటికీ జనాల్లో ఉండడం, ప్రత్యేక హోదా తో పాటు, ఏపీకి నిధులు విడుదల వంటి విషయాలలోనూ చిన్నచూపు చూస్తూ ఉండటం, దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ధరలు, ఇవన్నీ ఇక్కడ బిజెపి ఎదుగుదలకు అడ్డంకిగా మారిపోయాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

అసలు బీజేపీ ఏపీలో బలపడలేకపోవడానికి అప్పుడు టిడిపి కారణమని సోము వీర్రాజు చెప్పినా, ఇప్పుడు జనసేన పార్టీని ఉపయోగించుకుని బిజెపి బలపడలేకపోవడం, అసలు సొంతంగా ఎన్నికలను ఎదుర్కొనే అంత స్థాయిలో లేకపోవడం ఇవన్నీ ఇబ్బందికరంగానే మారాయి.ఎప్పుడూ ఏదో ఒక పార్టీ కారణంగానే తాము ఎదగలేకపోయాము అని చెబుతుండడం తప్పించి, సొంతంగా ఎదిగేందుకు సరైన ప్రణాళిక వేసుకోలేక పోవటం వంటి కారణాలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం లేకపోవడం ఇవన్నీ బిజెపి ఎదుగుదలకు అడ్డుగోడగా మారుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు