మ‌ళ్లీ వివాదంలో చిక్కుకున్న పంజాబ్ కొత్త సీఎం.. ఈ సారి కొడుకును తీసుకురావ‌డంతో..

పంజాబ్ కొత్త సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చాలా రోజులుగా వార్త‌ల్లో నిలుస్తున్నారు.

ఆయ‌న కొత్తగా సీఎం అయిన‌ప్ప‌టి నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు.

మొన్న‌టికి మొన్న ప్ర‌త్యేకంగా జెట్ విమానంలో ఢిల్లీకి వెళ్ల‌డం ద‌గ్గ‌రి నుంచి అనేక ఆరోప‌ణ‌లు ఆయ‌న మీద వ‌స్తున్నాయి.ఇవ‌న్నీ స‌రిపోవ‌న్న‌ట్టు ఇప్పుడు మ‌రో వివాదంలో చిక్కుకున్నారు.

ఇప్ప‌టికే కాంగ్రెస్ వివాదాల్లో ఉండ‌టంతో ఆయ‌న్ను సీఎంగా చేస్తే ఆయ‌న బాధ్యతగా వ్యవహరిస్తూ పార్టీకి మంచి పేరు తీసుకురావాల్సింది పోయి మ‌రిన్ని చిక్కులు తెచ్చిపెడుతున్నారు.ఆయ‌న వ్య‌వ‌హార శైలి అటు కాంగ్రెస్ కు కొత్త తిప్పలు తెచ్చిపెడుతోంది.

ఇప్పటికే సొంత పార్టీ నేత‌ల విమ‌ర్శ‌లు, తిరుగుబాటుతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న ఏమాత్రం రిపేర్ చేయ‌కుండా మ‌రిన్ని స‌మ‌స్య‌లు తెస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.ఇక తాఆజ‌గా డీజీపీ ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటాతో పాటుగా ఇంకొంద‌రు సీనియర్ పోలీసు ఆఫీస‌ర్ల‌తో ఇంపార్టెంట్ మీటింగ్ ఏర్పాటు చేశారు కొత్త సీఎం.

Advertisement

అయితే చరణ్ జింత్ సింగ్ చన్ని తాను మాత్ర‌మే రాకుండా ప్ర‌భుత్వ ప‌ర‌మైన ఈ స‌మావేశానికి తన కొడుకు రిథమ్ జిత్ సింగ్ ను తీసుకొచ్చారు.అస‌లు ఆయ‌న‌కు ఈ స‌మావేశానికి సంబంధం లేక‌పోయినా ఆయ‌న్ను త‌న వెంట పెట్టుకు రావటం తీవ్ర విమ‌ర్శ‌లుకు తావిస్తోంది.

ఇక త‌న కొడుకును తాను కూర్చున్న ద‌గ్గ‌రే వెనుక వరుసలో కూర్చోబెట్టుకుని స‌మావేశాన్ని నిర్వ‌హించ‌డం తీవ్ర‌వ విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.ప్ర‌భుత్వ మీటింగ్‌కు ఎవ‌రూ రావొద్ద‌నే నియ‌మాలు తెలియ‌వా, అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కుమారుడ్ని వెంట పెట్టుకు రావటమా అంటూ ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జ‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ఎందుకంటే ఈ స‌మావేశం రాష్ట్ర భద్రత‌కు సంబంధించింది.

ఇలాంటివి చాలా గోప్యంగా నిర్వ‌హించాలి గానీ ఇలా కొడుకును తీసుకురావ‌డ‌మేంట‌ని అంద‌రూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.ఇక సీఎం చ‌న్నీ త‌న కొడుకును తీసుకుని వ‌చ్చిన ఫోటోలు, వీడియోల‌ను నెట్టింట వైరల్ గా మారాయి.ఈ ఫొటో చూస్తుంటే సీఎం కొడుకు అధికారుల వెనుక సీట్లోనే వారికి ద‌గ్గ‌ర‌గా కూర్చొని త‌న తండ్రి ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నారో, పోలీసు ఆఫీస‌ర్లు ఎలాంటి స‌మాచారం ఇస్తున్నారో చాలా జాగ్ర‌త్త‌గా వింటున్న‌ట్టు క‌నిపిస్తోంది.

దీన్ని బీజేపీ హైలెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది.ఇక నెటిజ‌న్లు అయితే ఓ రేంజ్‌లో దీన్ని ట్రోల్ చేస్తున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు