అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయ అర్చకులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.అర్చకులకు 25 శాతం జీతం పెంచుతున్నట్లు.

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు తెలియజేశారు.ఈరోజు ఉదయం దేవాదాయ శాఖ పై సీఎం జగన్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లడించారు.అంత మాత్రమే కాక వంశపారపర్యంగా అధ్యక్షుల నియామకం చేపడుతున్నట్లు కూడా స్పష్టం చేశారు.

గత వేసవి లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకుల జీతాన్ని పెంచడం జరిగింది.కేటగిరి వన్ దేవస్థానాలలో  పనిచేసే అర్చకుల శాలరీని 10 వేల నుండి 15 వేలకు పైగా పెంచారు.

Advertisement

ఇక కేటగిరి 2 దేవస్థానాలు పనిచేసే అర్చకులు వేతనాన్ని ఐదు వేల నుంచి పది వేలకు పంచడం జరిగింది.ఇప్పుడు మరోసారి వారి వేతనాలు పెంచుతూ.

జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చకులు.సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు