కేటీఆర్‌ను ఫిదా చేసిన బుడ్డోడు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

మ‌న ద‌గ్గ‌ర చేయాల‌నే ప‌ట్టుద‌ల ఉండాల‌నే గానీ ఏ పని అయినా చేయొచ్చ‌ని ఇప్ప‌టికే ఎంద‌రో నిర‌పించారు.

చాలా చిన్న పొజీష‌న్ నుంచి వ‌చ్చి దేశానికి రోల్ మాడ‌ల్ గా త‌యార‌య్యారు ఎంతో మంది.

అబ్దుల్ క‌లాం లాంటి వారు కూడా పేప‌ర్ బాయ్ గా ప‌నిచేసిన వారే.అందుకే అన్నారు పెద్ద‌లు కృషి ఉంటే రుషులవుతార‌ని, అయితే ఈ పాట ఇప్పుడెందుకు అంటే వీట‌న్నింటికీ ఇప్పుడు ఓ బుడ్డోడు స‌రిపోతాడ‌ని పిస్తుంది.

ఈ ఒక్క‌రోజే ఆ బుడ్డోడు సోష‌ల్ మీడియాలో స్టార్ అయిపోయాడు.ఏకంగా మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయిపోయారు.

ఆ వీడియో చూసిన మంత్రి కేటీఆర్ ఆ చిన్నోడి ఆత్మవిశ్వాసానికి ఫిదా అయిపోయిన‌ట్టు తెలిపారు.ఇలాంటి ఎన్నో ఇన్ స్పిరేష‌న్ వీడియోల‌ను మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదిక‌గా ఎన్నో షేర్ చేస్తూ ఉంటారు.

Advertisement

జ‌గిత్యాలకు జిల్లాలో ఈ వీడియో తీసిన‌ట్టు తెలుస్తోంది.ఈ ప‌ట్ట‌ణంలో 9వ తరగతి చ‌దువుతున్న ప్రకాష్ మార్నింగ్ టైమ్‌లో పేపర్ వేస్తూ డ‌బ్బులు సంపాదిస్తున్నాడు.

అయితే ఆ కుర్రాడిని ఓ వ్య‌క్తి వెంబ‌డిస్తూ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆగుతాడు.ఏం పేరు అని అడ‌గ్గా త‌న వివ‌రాలు చెప్తుంటాడు.

దాంతో ఆ కుర్రాడు త‌న గురించి ఎప్తాడు.

చ‌దువుకునే వ‌య‌సులో ఇలా ఎందుకు చేస్తున్నావ‌ని అడ‌గ్గా ఏం చేయొద్దా త‌ప్పేముంది అని ఎదురు ప్ర‌శ్నిస్తాడు.ఈ వీడియో ఈరోజు ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో చెక్క‌ర్లు కొడుతోంది.కాగా దీన్ని చూసిన కేటీఆర్ చిన్నారి ఆత్మవిశ్వాసం త‌న‌ను బాగా ఆకట్టుకున్న‌ట్టు చెప్తూ కేటీఆర్ ఆ వీడియోను షేర్ చేశారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కాగా ఈ వీడియో చూసిన వారంతా కూడా ఆ బుడ్డోడి మాట‌ల‌కు ఫిదా అయిపోతున్నారు.క‌ష్ట‌ప‌డే త‌త్వం ఉండాలే గానీ మంచి పొజీష‌న్‌లో ఉంటాడ‌ని అంతా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

ఇంకొంద‌రు ఆ చిన్నారికి చేయూత ఇవ్వాల‌ని కోరుతున్నారు.

తాజా వార్తలు