బిగ్ బాస్ హౌస్ నుంచి మూడో వారం ఎలిమినేట్ అయ్యేది ఈమేనా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో మూడవ వారం ఎలిమినేషన్ కు ఐదుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు.

ప్రియ, శ్రీరామ్ చంద్ర, మానస్, ప్రియాంక, లహరి షారా ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.

నామినేషన్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లు మరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కాకపోవడం గమనార్హం.అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక సింగ్ లేదా ప్రియ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ప్రియ ఈ మధ్య కాలంలో అనవసర వివాదాల్లో చిక్కుకోవడం ఆమెకు మైనస్ గా మారింది. రవి గురించి ప్రియ చేసిన కామెంట్లు ఆమెకు ప్రేక్షకుల్లో నెగిటివ్ ఇమేజ్ రావడానికి కారణమయ్యాయి.

మరోవైపు ప్రియాంక సింగ్ కు ప్రేక్షకుల్లో పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం మైనస్ గా మారింది.అయితే కొన్నిసార్లు బిగ్ బాస్ ఎవరూ ఊహించని కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్న నేపథ్యంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉంది.

Advertisement

రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు బిగ్ బాస్ షో వీక్ డేస్ లో ప్రసారమవుతున్నా ఈ షోకు టీఆర్పీ రేటింగ్స్ మాత్రం బాగానే వస్తున్నాయని తెలుస్తోంది.నిన్నటి ఎపిసోడ్ లో లోబో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ప్రియాంక సింగ్ చెప్పుకొచ్చారు.గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో కంటెస్టెంట్ల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతుండటం గమనార్హం.

బయట ఫ్యాన్ ఫాలోయింగ్ లేని కంటెస్టెంట్లు హౌస్ లో ఎక్కువగా కొనసాగుతున్నారు.

క్రేజ్ లేని కంటెస్టెంట్లు ఎక్కువగా ఉండటం బిగ్ బాస్ షోకు మైనస్ అవుతోంది.నాగార్జున తన హోస్టింగ్ తో వీకెండ్ ఎపిసోడ్లకు మంచి రేటింగ్ వచ్చేలా చేస్తున్నా రాబోయే రోజుల్లో వీక్ డేస్ ఎపిసోడ్లు ఇదే స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకుంటాయో లేదో చూడాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు