టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా భీమ్లా నాయక్.ఈ సినిమా ఇప్పటికే శాటిలైట్ రైట్స్ మరియు ఓటీటీ రైట్స్ ను అమ్మేశారు.
సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ ఎత్తున బిజినెస్ అయ్యింది.కనుక సినిమా షూటింగ్ ముగియకుండానే సినిమాను అన్ని ప్లాట్ ఫామ్స్ వారు కూడా కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు.
ఈ సినిమా కు సంబంధించిన రేట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆడియో రైట్స్ కు గాను 5.04 కోట్ల రూపాయలను ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇది నాన్ పాన్ ఇండియా మూవీ రికార్డ్ గా చెబుతున్నారు.
గతంలో జల్సా సినిమా తో రికార్డు స్థాయిలో రైట్స్ దక్కించుకున్న విషయం తెల్సిందే.జల్సా సినిమాకు గాను 90 లక్షల రూపాయలను ఆడియో రైట్స్ ద్వారా దక్కించుకున్నారు.
అంతకు ముందు వరకు ఏ సినిమా కూడా 90 లక్షల కు అమ్ముడు పోయిందే లేదు.ఆ తర్వాత కొమురం పులి సినిమా ఆడియో రైట్స్ ను రెండు కోట్లకు అమ్మడం జరిగింది.ఆ తర్వాత అజ్ఞాత వాసి నినిమా 2.9 కోట్ల రూపాయలను ఈ సినిమా దక్కించుకుంది.అజ్ఞతవాసి కూడా ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింది.

తాజాగా మరోసారి నాన్ పాన్ ఇండియా రికార్డ్ ను దక్కించుకున్నాడు.నాల్గవ సారి భీమ్లా నాయక్ సినిమా తో కూడా ఆల్ టైమ్ రికార్డ్ ను దక్కించుకున్నాడు.సర్కారు వారి పాట మరియు ఆచార్యను మించిన రేంజ్ లో ఆడియో రైట్స్ అమ్ముడు పోయాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉన్నారు.వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.