విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవలే చేయి ఆపరేషన్ చేయించుకున్న విషయం తెల్సిందే.ఆయన షూటింగ్ లో ఉన్న సమయంలో చేయి నొప్పి విపరీతంగా ఉండటంతో నేరుగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నాడు.
అక్కడ ఆయనకు సర్జరీ అయిన విషయం తెల్సిందే.దాంతో ఆయన కనీసం నెల రోజుల పాటు షూటింగ్ లకు దూరంగా ఉంటారని అంతా భావించారు.
కాని ఆయన వారం కూడా గడవక ముందే షూటింగ్ కు హాజరు అయ్యేందుకు సిద్దం అయ్యాడు.ఆయన డెడికేషన్ మరియు ఆయన పట్టుదల ఏంటో దీంతో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వం అనే సినిమా రూపొందుతోంది.ఆ సినిమాలో కార్తీతో పాటు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా షూటింగ్ కోసం ప్రకాష్ రాజ్ మళ్లీ వెళ్లి పోయాడు.చేయి నొప్పి ఉన్నా కూడా షూటింగ్ ఆగిపోతే నిర్మాతకు ఇబ్బంది మరియు ఇతర నటీ నటుల డేట్ల విషయంలో సమస్యలు తలెత్తుతాయి.అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్వాలియర్ కు చిత్ర యూనిట్ సభ్యులతో వెళ్లి పోయాడు.అక్కడ ప్రకాష్ రాజ్ చేయి కి తగ్గట్లుగానే షూటింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
వరుసగా ప్రకాష్ రాజ్ ఈమద్య కాలంలో వార్తల్లో నిలుస్తున్నాడు.మా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నందుకు గాను ఈయన పై కొందరు విమర్శలు చేస్తుండగా కొందరు మాత్రం ఆయన్న మద్దతు గా ప్రోత్సహిస్తున్నారు.
త్వరలోనే ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడు అవుతాడేమో చూడాలి. ప్రకాష్ రాజ్ కేవలం తమిళంలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తున్నాడు.
తెలుగు మరియు ఇతర భాషల్లో బిజీ ఆర్టిస్టు అయిన ప్రకాష్ రాజ్ ఈనెల చివరి వరకు గ్వాలియర్ లోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.