వర్మ తన ఫ్యామిలీకి దూరంగా ఉండటానికి అసలు కారణమిదే?

ప్రేక్షకుల్లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన జీవితంలో ఒక్కసారే భయపడ్డానని 20 సెకన్ల సమయం తాను భయపడాల్సి వచ్చిందని వర్మ చెప్పుకొచ్చారు.తాను ముంబైకు వెళ్లిన సమయంలో ఒక వ్యాన్ లో నలుగురు నన్ను చూస్తున్నారని నాకోసం వచ్చారని ఫీలింగ్ వచ్చిందని వర్మ అన్నారు.

ఆ తర్వాత తాను కారు ఎక్కానని అయితే వాళ్లు తననే చూస్తూ ఉండటంతో చంపడానికి వచ్చారని భయపడ్డానని వర్మ పేర్కొన్నారు.ఆ తర్వాత డ్రైవర్ ద్వారా వాళ్లు లిఫ్ట్ రిపైర్ చేయడానికి వచ్చారని తెలిసిందని తను డైరెక్టర్ అని గుర్తు పట్టడం వల్ల వాళ్లు అలా చేశారని వర్మ వెల్లడించారు.మరొక సందర్భంలో తాను కారులో ఉంటే ఒక వ్యక్తి బైక్ తో ఫాలో చేశాడని అతడిని ఎవరని అడగగా బ్యాగ్ లో చెయ్యి పెట్టి స్క్రిప్ట్ తీశాడని వర్మ తెలిపారు.

తాను దొంగతనం చేశానని ఫాదర్ జేబులో డబ్బులు తీసుకున్నానని వర్మ తెలిపారు.పాపులారిటీ వచ్చిన తరువాతే రూమర్లు వచ్చాయని ఆర్జీవీ అన్నారు.నాగార్జునతో తాను ఇంగ్లీష్ లో మాట్లాడటం వల్ల అనేక రూమర్లు వచ్చాయని వర్మ అన్నారు.

Advertisement

తాను అనేక రూమర్లు క్రియేట్ చేశానని వర్మ చెప్పుకొచ్చారు.వెనుకల ఒక బ్యాచ్ ఉంది అంటే ఎవరైనా భయపడతారని వర్మ వెల్లడించారు.

నాలా ఉండాలని అనుకుంటే వచ్చే జన్మ వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ఇప్పుడే ఉండవచ్చని వర్మ పేర్కొన్నారు.ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో అప్పుడే లైఫ్ అయిపోయినట్టే అని వర్మ వెల్లడించారు.భార్య పిల్లలు, చదువులో పడితే ఎక్స్ టెన్షన్ ఆఫ్ లైఫ్ లో పడాలని తనకు అలా ఎక్స్ టెన్షన్ ఉండటం ఇష్టం ఇష్టం లేదు కాబట్టే సింగిల్ గా ఫ్యామిలీకి దూరంగా ఉన్నానని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు