కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి మద్రాస్ హైకోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది.స్టార్ హీరో ధనుష్ 48 గంటల లోగా 30.30 లక్షలను చెల్లించాలని చెబుతూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.అంత పెద్ద మొత్తంలో పన్నులు ఎందుకు చెల్లించాలి.
అసలేం జరిగింది అనే విషయానికి వస్తే… హీరో ధనుష్ 2015 వ సంవత్సరం లో UK నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ కారు ఎంట్రీ టాక్స్ మినహాయింపు కోసం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈవిధంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా అతని తరఫు న్యాయవాది కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ క్రమంలోనే ధనుష్ తన పిటిషన్ ఉపసంహరించుకోవాలని భావించాడు.ధనుష్ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు ధనుష్ పిటిషన్ ఉపసంహరించుకోవడానికి వీలులేదని తెలిపింది.
ధనుష్ చెల్లిస్తున్నటువంటి పన్నులలో 50% చెల్లించి మిగిలిన డబ్బును ఆగస్టు 9వ తేదీలోగా చెల్లించడానికి అంగీకారం తెలిపి తన పిటిషన్ ఉపసంహరించుకోవాలని హైకోర్టు తెలిపింది.

సబ్బులు కొనే సామాన్యుడు కూడా పన్నులు చెల్లిస్తున్నారు.మీరు కోట్లు సంపాదిస్తున్నారు కదా.ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, చట్టానికి అనుకూలంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ధనుష్ కేవలం 48 గంటలలో మిగిలిఉన్న 30.30 లక్షలను చెల్లించాలని తీర్పునిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.