మానవత్వం అంటే ఇదేనేమో: హిందూ బాలిక కు తండ్రిగా మారి ఆమె పెళ్లిని చేసిన ముస్లిం వ్యక్తి..!

మన భారతదేశంలో ఎన్నో మతాలు, జాతులు ఉండటం మనందరికీ తెలిసిన విషయమే.

అయితే చాలాసార్లు హిందువులకు ముస్లింలకు సంబంధించిన గొడవలు ఎత్తిచూపడం లాంటి సన్నివేశాలను సినిమాలలో చూస్తూ ఉండడం గమనించాము.

అయితే ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా మారిపోయింది.ఎక్కడ కూడా మతసామరస్యం లేకుండా అందరూ కలిసి మెలసి జీవిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే.ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ వారి చుట్టుపక్కల వారికి కూడా వీలైనంత సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

అయితే తాజాగా మత సామరస్యాన్ని చాటుతూ ఓ సంఘటన చోటు చేసుకుంది.కర్ణాటక రాష్ట్రానికి చెందిన మెహబూబ్ మస్లి అనే వ్యక్తి వారి చుట్టుపక్కల అనాథగా మారిన పూజ అనే ఓ బాలికను అతడు చేరదీశాడు.10 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయిని చేరదీసి తండ్రిలా మారాడు.ఇకపోతే ప్రస్తుతం ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు నిండాయి.

Advertisement

దీంతో అతడు తన కూతురికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు.అయితే పూజ హిందూ మతానికి చెందినది కావడంతో మహబూబ్ కూడా ఆమెకు హిందూ మత సంప్రదాయంలో ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఓ హిందూ వ్యక్తితో వివాహం జరిపించాడు.

మెహబూబ్ మస్లి ముస్లిం వ్యక్తి అయినా సరే.ఆ అమ్మాయిని 10 సంవత్సరాలుగా పెంచుతూ ఉన్న కానీ.ఆ అమ్మాయిని ఎప్పుడు ఇస్లాం మతం లోకి రావాలని చెప్పలేదని అతను చెప్పుకొచ్చాడు.

మెహబూబ్ కి ఇదివరకే ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ పూజను చేరదీసి తన దయ హృదయాన్ని చాటుకున్నాడు.ఇక పెళ్లి విషయంలో పూజని పెళ్లి చేసుకున్న వరుడు, అలాగే వారి తల్లిదండ్రులు ఎటువంటి కట్నకానుకలు డిమాండ్ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ప్రజలందరూ మతాల మధ్య వివాదాలు చూడకుండా మత సామరస్యంగా జీవించాలి అంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.ఈ విషయం సంబంధించి కూతురు పూజ మాట్లాడగా.విశాల హృదయం కలిగిన తల్లిదండ్రులు నాకు దొరకడం అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

వారు తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేశారని ఆవిడ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేసింది.ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రస్తుతం మహబూబ్ ను నెటిజెన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

తాజా వార్తలు