టోక్యో ఒలింపిక్స్ : 35 మంది క్రీడాకారులకు కరోనా..!

ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యో నగరంలో కరోనా విశ్వరూపం చూపిస్తుంది.

తాజాగా ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చిన 35 మంది క్రీడాకారులకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం.

ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ వెల్లడించింది.జూలై నెలలో టోక్యో ఎయిర్ పోర్ట్ లో 448815 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 90 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

అయితే వారిలో 35 మంది ఒలింపిక్స్ క్రీడాకారులు ఉన్నట్టు తెలుస్తుంది.జూలై 1 నుండి 31 వరకు ఎయిర్ పోర్ట్ లో కరోనా పరీక్షలు చేయగా 0.08 శాతం మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఒలింపిక్స్ కమిటీ చెప్పింది.ప్రతిరోజూ 30 వేల మంది దాకా కొవిడ్ పరీక్షలు చేస్తున్నట్టు సమాచారం.

పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్ కు తరలిస్తున్నట్టు తెలుస్తుంది.కరోనా భధ్రతా నిబంధనలు పాటిస్తూ ఒలింపిక్స్ క్రీడలు సురక్షితంగా నిర్వహిస్తున్నామని ఒలింపిక్స్ కమిటీ సీఈఓ తోసిరో వెల్లడించారు.

Advertisement

ఓ పక్క క్రీడలు నిర్వహిస్తున్నా సరే క్రీడాకారుల్లో కరోనా పాజిటివ్ రావడం అక్కడ మిగతా క్రీడాకారులను ఆందోళన కలిగిస్తుంది.ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల తమ అత్యుత్తమ ప్రదర్శన చూపిస్తున్నారు.

 భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగిస్తున్నారు.ఇప్పటికే మూడు పతకాలను కైవసరం చేసుకుంది భారత్.

Advertisement

తాజా వార్తలు