అప్పుడప్పుడు పొరపాటున చేసే కొన్ని పనులు కూడా తీవ్ర విమర్శలకు తావిస్తాయి.ఇక అవి రాజకీయాల్లో అయితే మరితగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఇప్పుడు టీఆర్ ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయనే చెప్పాలి.ఎందుకంటే ఆయన చేసిన ఓ పని ఇప్పుడు ఆయనకు పెద్ద ఎత్తున వ్యతిరేకత తీసుకొస్తోంది.
రీసెంట్‌గా జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్ గుట్కా నములుతున్నారంటూ వచ్చిన వార్తలు పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది.
దాంతో ప్రతిపక్ష మీడియా మొత్తం దీన్ని హైలెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసింది.
ఇక ఛాన్ష్ దొరికిందన్నట్టు ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని బేస్ చేసుకుని మంత్రులపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తీసుకొచ్చే పనిలో పడ్డారు.ఇక అప్పటి నుంచి మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఎక్కడకు వెళ్లినా ఇవే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలో అయితే ఏకంగా గుట్కా మంత్రి అంటూ ట్రోలింగ్ కూడా మొదలయిపోయింది.ఈ విషయం కాస్తా ఏకంగా టీఆర్ ఎస్ అధిష్టానం దాకా వెళ్లడంతో వారు కూడా బాగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే నిన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఏకంగా హుజూరాబాద్‌కు వెళ్లి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఇక అక్కడ ఈటల రాజేందర్‌పై విమర్శలు చేయడంతో బీజేపీ ఒంటి కాలిపై లేచింది.గుట్కా బుక్కే మంత్రికి ఇక్కడేం పని వెళ్లి గుట్కా బుక్కుకోక అంటూ ఎద్దేవా చేడయంతో టీఆర్ ఎస్ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.ఇక ఈ మ్యాటర్ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కానీ ఇలాంటి విమర్శలపై మంత్రి తలసాని కూడా పెద్దగా స్పందించకపోవడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.