క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలోపేతంపై రేవంత్ దృష్టి...

పీసీసీ చీఫ్ గా  రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తరువాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది.

ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో రాజ్ భవన్ ముట్టడికి ఇచ్చిన పిలుపు ఎంతగా వివాస్పదమయిన విషయం తెలిసిందే.అయితే కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తేజితులను చేస్తూ ముందుకు సాగుతున్న రేవంత్ ఇక క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ ను పటిష్ట పరచడానికి కార్యాచరణకు దిగనున్నట్లు  తెలుస్తోంది.

ఎందుకంటే క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేయడం ద్వారానే కాంగ్రెస్ పటిష్టపడుతుందనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ పై ఎక్కువ నమ్మకంపై పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పడు క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ ను బలోపేతం చేయకపోతే ఏ ఎన్నికలో నైనా సత్తా చాటడం అన్నది సాధ్యం కాదన్నది  రేవంత్ ఆభిప్రాయం.అయితే రేవంత్ పాదయాత్రను నిర్వహించడానికి కూడా ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయి పటిష్టతకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Advertisement

మరి రేవంత్ వ్యూహాలు సఫలమైతే కాంగ్రెస్ దశ మారటం ఖాయం అన్నట్లు తెలుస్తోంది.అయితే రేవంత్ ఇప్పటికే సీనియర్ లను కలుపుకొని పోతూ ముందుకెళ్తున్నపరిస్థితులలో వారి సేవలను ఎలా వినియోగించుకుంటారో తెలియాల్సి ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు