ఎప్పుడూ ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూనే, జగన్ ఎప్పుడు వివాదస్పదం అవుతూ ఉంటారు.ప్రతిపక్షాలకే కాకుండా, సొంత పార్టీ నేతలకు అప్పుడప్పుడు జగన్ షాకులు ఇస్తూ ఉంటారు.
ఇప్పుడు అదే రకమైన పరిస్థితిని జగన్ తీసుకువచ్చారు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను భర్తీ చేసే ప్రక్రియకు కొద్ది రోజులుగా జగన్ శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే అనేక మంది పేర్లతో లిస్టు ఫైనల్ చేశారు.ఈ రోజు నామినేటెడ్ పదవులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించబోతున్నారు.
ఈ కొత్త నామినేటెడ్ పదవుల్లో ఎక్కువగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారు, అలాగే టికెట్ ఆశించి భంగపడ్డ వారు, ఇంకా అనేక మంది కీలక నాయకులను ఎంపిక చేశారు.ఈ ఎంపిక పై ఎవరూ జగన్ ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకు పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, తనకు అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేలకు వివిధ నామినేటెడ్ పదవులు ఇచ్చారు.మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడ్డ వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి బుజ్జగించారు.
అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు గా ఉన్న వారికి అదనంగా పదవులు అనవసరమనే జగన్ నిర్ణయానికి వచ్చారట.
దీనిలో భాగంగానే ఎమ్మెల్యేలకు ఇచ్చిన నామినేటెడ్ పదవులను ఇప్పుడు వేరే వారికి కేటాయించినట్లు తెలుస్తోంది.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్ ఇప్పుడు పోస్టులో విశాఖకు చెందిన సీతం రాజు సుధాకర్ ను ఎంపిక చేశారు.ఈయనకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు, టిటిడి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా హోదా కల్పించారు.
అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ను తప్పించి వేరొకరిని ఆ పదవికి ఎంపిక చేసినట్లు సమాచారం.ఇక జగన్ కు అత్యంత సన్నిహిత రాలుగా, పార్టీ కీలక నాయకురాలిగా ఉన్న ఆర్.కె.రోజా కు ఇచ్చిన ఏపీఐఐసీ పదవి ఎవరికి కేటాయిస్తారు అనేది తేలాల్సి ఉంది.వీరే కాకుండా ఎమ్మెల్యేలకు ఇచ్చిన నామినేటెడ్ పదవులు అన్నిటినీ రద్దుచేసి, వాటిల్లో మిగతా వారికి అవకాశం కల్పించి రాజకీయంగా వారిలో ఉన్న అసంతృప్తిని పోగొట్టాలనేదే జగన్ ఉద్దేశంగా కనిపిస్తోంది.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
వీఎం ఆర్డి చైర్మన్ గా అక్రమాని విజయనిర్మల ( విశాఖ తూర్పు నియోజకవర్గం ), రాష్ట్ర విద్యా విభాగం వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ ( విశాఖ పశ్చిమ), నెడ్ క్యాప్ చైర్మన్ గా కే కే రాజు ( విశాఖ ఉత్తరం), రాష్ట్ర మైనారిటీ విభాగం చైర్మన్ గా జాన్ వెస్లీ ( విశాఖ దక్షిణం), రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ గా దాడి రత్నాకర్ (అనకాపల్లి), విశాఖ రీజియన్ పెట్రో కారిడార్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ (విశాఖ ఉత్తరం ), స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జీవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా చింతకాయల సన్యాసి పాత్రుడు ( నర్సీపట్నం), డి సి ఎం చైర్మన్ గా పల్లా చిన్న తల్లి ( గాజువాక ), అలాగే ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మైనారిటీ వర్గానికి చెందిన అహ్మద్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఈరోజు వెలువడనుంది.