సోషల్ మీడియా అనేది ఒక అద్భుత ప్రపంచం.అందులో ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.
చాలా మంది ఆ వీడియోలను చూసి ఆశ్చర్యపోతుంటారు.ఇంకొందరు అయితే భయపడిపోతుంటారు.
ఇందులో పాపులర్ అవ్వాలనుకునేవారు రకరకాల విచిత్రమైన పనులు చేస్తూ, ఎన్నో రకాల భయానక వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వదులుతుంటారు.వాటివల్ల చాలా మంది పాపులర్ అవ్వడమే కాదు.
సెలబ్రిటీలు కూడా అయ్యారు.తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కొన్ని రకాలైన వీడియోలు చాలా అందంగా మనసుకు ప్రశాంతంగా ఉంచేవిగా ఉంటాయి.ఇంకొన్నింటిని చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
మరికొన్ని వీడియోలు నవ్వును పూయిస్తుంటాయి.మనం ఇప్పుడు చెప్పుకునే వీడియో హాస్యానికి సంబంధించినదే.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఓ అమ్మాయి చేసిన పని అందరికీ నవ్వును తెప్పిస్తోంది.
ఇక ఈ వీడియోలో మ్యాటర్ విషయానికి వస్తే.ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది.చాలా మంది వర్షాలు పడుతుంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు తమ పనులు ఆటంకంగా మారిందని బాధపడుతున్నారు.
ఇలాంటి వానలో ఓ యువతి కల్లాపి చల్లి అందర్నీ ఆశ్చర్యపరిచింది.తనఇంటి ముందు వైపుగా వాన నీరు వరదలా పోతున్నా పట్టించుకోకుండా ఆమె మాత్రం కల్లాపి చల్లి అందరికి నవ్వు తెప్పిస్తోంది.
ఆమె తన ఇంటి ముందు వాన నీరు వరదలా పోతున్నా కూడా పట్టించుకోకుండా కల్లాపి చల్లే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.దీంతో ఆ వీడియో కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెడీగా కామెంట్లు చేస్తూన్నారు.వర్షం పడుతూనే ఉన్నా కూడా ఇలాంటి సమయంలో ఇంటి ముందు కల్లాపి నీళ్లు చల్లడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ఇంకొందరు అయితే ఈ అక్కకు కోపం ఎక్కువే మరి అంటూ కామెంట్లు చేశారు.మొత్తానికి ఈ వీడియోను చూసిన వారు తెగ నవ్వుకుంటున్నారు.