బ్రిక్స్ దేశాల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక కామెంట్స్..!!

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఇటీవల పదవి అధిరోహించిన కిషన్ రెడ్డి తాజాగా బ్రిక్స్ దేశాల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కీలక కామెంట్లు చేశారు.

పర్యాటక రంగంలో పరస్పరం సహకరించుకోవాలి అని సూచించారు.వర్చువల్ విధానం ద్వారా జరిగిన ఈ సమావేశంలో.

ఇండియా తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు పాల్గొన్నాయి.బ్రిక్స్ దేశాలు టూరిజం కి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఆయా దేశాల టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇక ఇదే తరుణంలో మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం పర్యాటకరంగం పై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు.బ్రిక్స్ దేశాల మధ్య మంచి సమన్వయ బంధం ఉందని ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తే మరిన్ని అద్భుతాలు పర్యాటక రంగంలో సృష్టించవచ్చ ని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

ముఖ్యంగా గ్రీన్ టూరిజం ఎక్కువగా ప్రమోట్ చేస్తే పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుందని ఈ సమావేశంలో సభ్యదేశాల మంత్రులకు కిషన్ రెడ్డి సూచించారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు