వరుణ్ మూవీ వల్ల థియేటర్ అమ్ముకున్న నిర్మాత.. ఏం జరిగిందంటే..?

హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వరుణ్ సందేశ్ పరిచయమయ్యారు.

తొలి సినిమాతోనే సక్సెస్ సాధించిన వరుణ్ సందేశ్ ఆ తరువాత కొత్త బంగారు లోకం సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు.

వరుణ్ సందేశ్ ఛమ్మక్ ఛల్లో అనే సినిమాలో నటించగా ఈ సినిమాకు డీఎస్ రావు నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమా గురించి డీఎస్ రావు మాట్లాడుతూ ఆ మూవీ కోసం సత్తెనపల్లి ఉన్న థియేటర్ ను ఫైనాన్స్ లో పెట్టానని చెప్పారు.

ఆ తరువాత కొన్ని చికాకుల వల్ల ఆ థియేటర్ ను వదులుకోవాల్సి వచ్చిందని డీఎస్ రావు చెప్పుకొచ్చారు.వరుణ్ సందేశ్ ఆ సినిమాకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశాడని వచ్చిన వార్తల్లో నిజం లేదని డీఎస్ రావు అన్నారు.

సత్తెనపల్లిలో థియేటర్ కొని సాయికృష్ణ డీలక్స్ అని పేరు మార్చానని ఆ ఊరిలో ఉన్న అన్ని థియేటర్లతో పోలిస్తే దానిని బ్రహ్మాండంగా చేయించానని డీఎస్ రావు అన్నారు.కానీ ఛమక్ ఛల్లో వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందని డీఎస్ రావు తెలిపారు.

Advertisement

తాను మోసగింపబడ్డానని ఫైనాన్షియర్స్ మోసం చేయడం వల్ల ఎక్కువ వడ్డీలు వేయడం వల్ల థియేటర్ ను వదులుకున్నామని డీఎస్ రావు వెల్లడించారు.ద్రోణ సినిమా సమయంలో ప్రియమణి స్విమ్ సూట్ లో కనిపించడానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని డీఎస్ రావు చెప్పుకొచ్చారు.ద్రోణ సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ బాగా వచ్చాయని 27 సెంటఱ్లలో ఆ సినిమా 50 రోజులు ఆడిందని డీఎస్ రావు ఆన్నారు.

నీలకంఠ డైరెక్షన్ లో వరుణ్ సందేశ్ హీరోగా కాథరిన్ థెస్రా, సంచితా పదుకొనే హీరోయిన్లుగా ఛమ్మక్ ఛల్లో తెరకెక్కగా ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది.ఫలితంగా ఈ సినిమా నిర్మాతకు భారీగా నష్టాలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు