వ‌ణికిస్తున్న జికా వైరస్.. ల‌క్ష‌ణాలు ఇవే!

ఉన్న వైర‌స్‌ల‌తోనే నానా ఇబ్బందులు ప‌డుతుంటే.కొత్త‌గా జికా వైర‌స్ వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది.

 What Are The Symptoms Of Zika Virus? Zika Virus, Symptoms Of Zika Virus, Symptom-TeluguStop.com

ఇప్ప‌టికే పాతిక దేశాల్లో విస్త‌రిస్తున్న జికా వైర‌స్‌.భార‌త్‌లోనూ అడుగు పెట్టింది.

డెంగ్యూ, మలేరియా మాదిరిగానే ఈ జికా వైర‌స్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది.అంటువ్యాధి అయిన ఈ జికా ఈడిస్ ఈజిప్ట్ దోమ‌ల కార‌ణంగా వ‌స్తుంది.

అయితే జికా వైర‌స్ సోకిన వారంద‌రూ చ‌నిపోతారు అని చెప్ప‌లేము.అలా అని ప్ర‌మాదం లేదు అని కూడా చెప్ప‌లేము.

ఎందుకంటే, ముందుగానే జికా వైర‌స్‌ను గుర్తించి ట్రీట్‌మెంట్ తీసుకుంటే.ఖ‌చ్చితంగా ఈ వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.మ‌రి జికా ల‌క్ష‌ణాలు ఏంటీ? ఎలా గుర్తించాలి? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.జికా సోకిన వారిలో మొద‌ట‌ తీవ్రమైన జ్వరం, ముక్కు కారడం, తల నొప్పి, చ‌ర్మంపై ద‌ద్దుర్లు ఏర్ప‌డ‌టం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

Telugu Headache, Tips, Latest, Muscle Pain, Rashes, Symptoms, Symptoms Zika, Zik

అలాగే కండ‌రాల నొప్పులు, కండ్ల క‌ల‌క‌, కీళ్ల నొప్పులు కూడా జికా వైర‌స్ ల‌క్ష‌ణాలే.ఇవి ఒక వారం పాటు అలానే ఉంటే.త‌ప్ప‌కుండా టెస్ట్‌లు చేయించుకోవాలి.లేదంటే ప్రాణాలే ముప్పుగా మారుతుంది.ఇక జికా వైర‌స్ ద‌రి చేర‌కుండా ఉండాలీ అంటే.ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా జికా వైర‌స్‌కు కార‌ణ‌మ‌య్యే ఈడిస్ ఈజిప్ట్ దోమ‌లు ప‌గ‌టి పూటే మ‌నుషుల‌పై ఎటాక్ చేస్తుంటాయి.

కాబ‌ట్టి, అంద‌రూ శ‌రీరానికి దోమ‌లు కుట్టకుండా ఆయిల్ రాసుకోవ‌డం, స్ప్రేలు చేసుకోవ‌డం చేయాలి.చేతులు పూర్తిగా క‌వ‌ర్ అయ్యేలా ఫుల్‌ స్లీవ్స్‌ దుస్తులు వేసుకోవాలి.ఇంట్లో దోమ తెరల‌ను వాడాలి.అలాగే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవాలి.

ఇంటి చుట్టూ మ‌రియు ఇంటి లోప‌ల‌ నీరు నిల్వ ఉండ‌కుండా జాగ్ర‌త్త తీసుకోవాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube