వైవాహిక జీవితం గురించి అడిగిన నెటిజన్.. నిహారిక షాకింగ్ కామెంట్స్..!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి, సినీ ప్రేక్షకులకు మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

సోషల్ మీడియాలో నిహారిక చాలా యాక్టివ్ గా ఉంటూ తన టాలెంట్లను నెటిజన్లకు తెలిసేలా చేస్తుంటారు.

బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా ప్రతిభతో నిహారిక సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.ఒకవైపు నటిగా కెరీర్ ను కొనసాగిస్తూనే నిహారిక నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.

పెళ్లి తర్వాత కూడా కెరీర్ పరంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నిహారిక తాజాగా వైవాహిక జీవితం గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.ఢీ డ్యాన్స్ షోకు యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన నిహారిక ఆ షోకు హోస్ట్ గా మెప్పించారు.

నిహారిక తన సొంత బ్యానర్ అయిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ పై వెబ్ సిరీస్ లను నిర్మించడంతో పాటు ఆ వెబ్ సిరీస్ లలో నటిస్తుండటం గమనార్హం.గతేడాది నిహారిక చైతన్యల వివాహం ఘనంగా జరిగింది.

Advertisement

రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ లో జరిగిన ఈ వివాహ వేడుక గురించి జోరుగా చర్చ జరిగింది.

పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు హాజరైనా నాగబాబు ఖర్చుకు వెనుకాడకుండా నిహారిక పెళ్లిని గ్రాండ్ గా జరిపించారు.సోషల్ మీడియాలో ఫోటోలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం నిహారిక అభిమానులతో పంచుకోవడం గమనార్హం.

తాజాగా నిహారిక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించారు.ఇందులో ఒక నెటిజన్ నిహారిక వైవాహిక జీవితం ఎలా ఉందో చెప్పాలని ప్రశ్నించగా నిహారిక భర్త చైతన్య కళ్లను మూయడంతో పాటు ఏమో సార్ నాకు కనపడదు అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.నిహారిక ఫన్నీ సమాధానాన్ని చూసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతవుతోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు