చైనా ప్రపంచానికి కరోనా వల్ల శత్రువులా మారిన ఏమాత్రం తన స్వార్ధాన్ని వదలకుండా ఇంకా దురాగతాలకు తెరలేపుతుంది.బహుశా కోవిడ్ వైరస్ వల్ల ప్రపంచానికి, ముఖ్యంగా భారత్‌కు జరిగిన నష్టానికి సంతృప్తి చెందనట్లుగా ఉంది ఈ డ్రాగన్ కంట్రీ.
ఇప్పటికే సరిహద్దులో పాక్‌తో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న భరతమాతకు పానకంలో పుడకలా డ్రాగన్ కంట్రీ తయారవుతుంది.

ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువ సరిహద్దుల్లో వివాదాలకు కాలు దువ్వుతున్న చైనా నీతి వాక్యాలు చెపుతూనే, నీతి తప్పి ప్రవర్తిస్తుంది.ఉద్రిక్తతలు పెరిగేలా వ్యవహరిస్తోంది.ఇలా చాటుమాటుగా దొంగ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న చైనా పై ఇండియా కూడా ఇంతకాలం ఓపికతో ఉన్న తాజాగా భారత ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి చైనా సరిహద్దుల్లోకి అదనంగా మరో 50 వేల మంది సైనికులను పంపించింది.
ఇకపోతే ప్రస్తుతం బోర్డర్లలో 2 లక్షల మంది సైనికులు విధుల్లో ఉండగా ఆ సంఖ్యను పెంచుకుంటు వెళ్లుతుంది ఇండియా.ఇదిలా ఉండగా మరోవైపు అణుశక్తి కలిగిన రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఊహించని పరిణామాలకు దారితీస్తే ఆ రోజులు ఇంకెత గడ్దుగా మారుతాయో ఊహకు అందడం లేదు.
ఏది ఏమైనా ప్రపంచదేశాలు ఏకం అయ్యి చైనా దురాగతాలకు చరమగీతం పాడితే గానీ కొంతైనా ప్రపంచానికి శాంతి లభించదని అనుకుంటున్నారట.